ఎన్నికల కోడ్ అతిక్రమణ కేసులో పీఆర్పీ నాయకుడు నాగేంద్రబాబు బుచ్చిరెడ్డిపాళెం పోలీసు స్టేషన్ లో సోమవారం ఉదయం లొంగిపోయారు. అనంతరం స్టేషన్ బెయిల్ పొందారు. ఏప్రియల్ 17న బుచ్చిరెడ్డిపాళెంలో నిబంధనలకు విరుధ్ధంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించటంతో కేసు నమోదు అయ్యింది. కాగా ప్రజారాజ్యం పార్టీలో సంస్ధాగత లోపాలను దిద్దుకొని, స్ధానిక సంస్ధల ఎన్నికల లోగా పార్టీని పటిష్టం చేస్తానని నాగబాబు తెలిపారు.
Story first published: Tuesday, May 26, 2009, 14:09 [IST]