'ఆరెంజ్' ఓవర్ బడ్జెట్ చేసారు నిజమే: నాగబాబు
"ఆరెంజ్" చిత్రం బడ్జెట్ పెరిగిందంటూ గత కొద్ది రోజులుగా అన్ని చోట్లా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి రూమర్స్ అని కొందరు పారేశారు. కానీ తాము అనుకున్న బడ్జెట్ ని ఆరెంజ్ దాటిందని, షూటింగ్ లో చాలా డబ్బు వేస్ట్ అయిందని నిర్మాత నాగబాబు ఒప్పుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...రెండు సార్లు ఆస్ట్రేలియా వెళ్ళి షూటింగ్ చేయటమే బడ్జెట్ కంట్రోలు తప్పటానికి కారణమైంది. దాదాపు మగధీర బడ్జెట్ కి దగ్గరలో అయింది. మగధీర కన్నా కేవలం ఇరవై శాతం బడ్జెట్ మాత్రమే తక్కువ. అతను కథ నేరేట్ చేసినప్పుడు మేము ఈ చిత్రానికి కొద్దిగా ఎక్కవ బడ్జెట్ అవుతుందనుకున్నాం కానీ ఈ రేంజిని ఊహించలేదు. అయితే ఈ చిత్రం అవుట్ పుట్ బాగా రావటం రిలీఫ్ ని ఇచ్చింది. ఇక మగధీర ఘన విజయంతో ఈ చిత్రాన్ని ఇరవై కోట్లుతో నిర్మించి మరో ఇరవై కోట్లు లాభం వేసుకుని అమ్ముకోవచ్చు కానీ..నేను రామ్ చరణ్ కి హాట్రిక్ ఇద్దామనే ఆలోచనలోనే ఉన్నాను కానీ డబ్బు లెక్కలు వేసుకోలేదు. నా బ్యానర్ లో అత్యంత పెద్ద బడ్జెట్ చిత్రం ఆరెంజే. ఇక స్టైలింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ కి ఈ కాలం కుర్రకారు ట్రెండ్ అవీ తెలుసు. అతని లుక్ ని, స్టైల్స్ ని అతనే స్వయంగా డిజైన్ చేసుకున్నాడు. ఇవాళ అన్ని చోట్ల నుంచి చరణ్ లుక్స్ కి ప్రశంశలు వస్తున్నాయి. నా అన్న కొడుకు యూత్ ఐకాన్ గా మారటం నాకు ఆనందాన్ని ఇచ్చే విషయమే కదా అన్నారు.


Click it and Unblock the Notifications











