రవితేజ నవయువకుడు కాదన్న నాగబాబు
ఎన్టీఆర్, బన్నీ, రామ్‌లను ఎనర్జిటిక్ హీరోలు అంటారు. నవయువకులైన వారిలో ఉన్నంత ఎనర్జీ రవితేజలో కనిపిస్తుంది. అన్ని ఎమోషన్సూ పలికించగల వెర్సటైల్ ఆర్టిస్ట్ అతను. నిరాశ, నిస్పృహలతో బాధపడే యువకులకు రవితేజ స్ఫూర్తి అని నాగబాబు అన్నారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం మిరపకాయ్ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా అతిథిగా విచ్చేసిన నాగబాబు పై విధంగా స్పందించారు. అయితే ఆయన అభిమానంగా అన్నా, మరో విధంగా అన్నా రవితేజకు వయస్సు అయిపోయిందని కావాలని గుర్తు చేసినట్లు ఉందని అంటున్నారు. నాగబాబు వ్యాఖ్యల్లో నిజం ఉన్నా ఎన్టీఆర్, బన్నీ,రామ్ లతో పోల్చి వరస హిట్లతో దూసుకుపోతున్న రవితేజను నవ యువకుడు కాదనటం భావ్యం కాదంటున్నారు రవితేజ ప్యాన్స్. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ నా ఫేవరెట్ ఆర్టిస్ట్ రవితేజ, కాబోయే ఫేవరెట్ దర్శకుడు హరీష్‌శంకర్. వీరి కలయికలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా బావుంటుంది. సినిమా పేరు మిరపకాయ్ అయినా దర్శకుడు ఇందులో స్వీట్ పెట్టి ఉంటాడని నా నమ్మకం అని చెప్పారు.


Click it and Unblock the Notifications











