అల్లు అర్జున్‌పై ట్వీట్.. నాగబాబు చేసింది కరెక్టేనా? ఐకాన్ స్టార్‌పై భగ్గుమంటున్న జనసేన క్యాడర్!
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలపడంపై మెగా బ్రదర్ నాగబాబు నర్మగర్భంగా చేసిన ట్వీట్ అత్యంత చర్చనీయాంశమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్న పార్టీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై మెగా, పవర్ స్టార్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అల్లు అర్జున్‌పై నాగబాబు చేసిన ట్వీట్ విషయంలో ఎలాంటి తప్పులేదంటూ ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు నంద్యాలలోని శిల్పా రవిరెడ్డికి మద్దతు ఇవ్వడం కోసం తన భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లారు. రవి రెడ్డి నివాసం వద్దకు వచ్చిన వేలాది మంది అభిమానులకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన సూచించారు. అబిమానులు, వైసీపీ కార్యకర్తలకు అభివాదం చేసిన తర్వాత తన స్నేహితుడిని గెలిపించడానికి వచ్చాను అంటూ తెలిపారు.

తనకు శిల్పా రవిరెడ్డి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గతంలో రవి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా వచ్చి ప్రచారం చేస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారమే నేను వచ్చి మద్దతు తెలియజేశాను. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. నాకు నచ్చిన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా నేను మద్దతు ఇస్తాను అంటూ తెలియచేశారు.
అయితే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలియజేయడంపై నాగబాబు ఘాటుగా స్పందించారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు రాయివాడైన మావాడే...! అంటూ తనలో భావనను ఆయన ట్విట్టర్ ద్వారా వ్యక్తీకరించారు. అయితే నాగబాబు ఎమోషనల్‌గా స్పందించడంపై మిశ్రమ స్పందన వచ్చింది.
అయితే ఎన్నికలు జరిగిన తర్వాత శిల్పా రవిరెడ్డి సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు మీద పడిందో ఏమో.. ఈ మధ్య ఏం జరిగినా సరే.. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌ను బయటకు పంపిస్తున్నాడు. ప్యాకేజ్ స్టార్‌ను వాడుకొంటున్నాడు అంటూ ఆయన కామెంట్స్ చేయడంపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు మరోసారి భగ్గుమన్నారు.
ఇలా మన కుటుంబంపై విమర్శలు, ఆరోపణలు చేసేవారికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం ముమ్మాటికి తప్పే. ఫ్యామిలీ ప్రయోజనాలు అల్లు అర్జున్‌కు పట్టవా? తమ కుటుంబంపై విమర్శలు చేసే వారికి ఎలా మద్దతు ఇస్తారు. వ్యక్తిగతంగా కాకుండా ట్వీట్ చేసి సపోర్ట్ చేసినా బాగుండేదేమో. పవన్ కల్యాణ్‌కు ట్వీట్ చేసి.. రవిని వ్యక్తిగతం కలవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











