తమ్ముడు పవర్ స్టార్ సక్సెస్ కి మెగాబ్రదర్ ఖుషీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష జంటగా రూపొందిన తీనమార్ చిత్రం ఈ నెల 14న విడుదలయ్యింది. మొదటి షోకే ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రిలీజ్ రోజున ఈ సినిమా మాట్ని షో టికెట్ బ్లాక్ లో మూడు వేల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని 'ఓడియన్ థియటర్' లోనే ఈ విధంగా తీనమార్ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారని సమాచారం. డబ్బులు పోతే పోయినా పవన్ తీనమార్ సినిమాని చూసి సంబరపడుతున్నారు పవన్ వీరాభిమానులు. విడుదలైన మొదటి రోజే ఎనిమిది కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించబోతోందని అంచనా. త్రివిక్రం డైలాగ్స్ లో కామెడీ బాగా వర్కౌట్ అయిందని, ఆ డైలాగ్స్ ని పవన్ చెప్పిన తీరు ఇంకా బాగుందని అభిమానులు అనుకుంటున్నారు. మొత్తానికి ఈ సినిమాతో పవన్ మళ్ళీ తన హవాను కొనసాగించనున్నాడు.
'తీన్ మార్" సినిమాకి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మెగా అభిమానులకంటే ఎక్కువగా సంతోషపడుతున్నది ఎవరో తెలుసా? నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ … వీళ్ళందరి కన్నా కూడా బాగా ఆనందపడుతున్నది నాగబాబు. ఎందుకంటే… పవన్ కల్యాణ్ నటించే తదుపరి చిత్రానికి అన్ అఫీషియల్ నిర్మాత నాగబాబే కాబట్టి! 'ఆరెంజ్" సినిమాతో ఆయన ఆర్ధికంగా దారుణంగా దెబ్బతిన్నాడు. సొంత బావమరిది మన్యం రమేష్ కూడా నాగబాబుని మోసం చేశాడని టాలీవుడ్ లో కథలు కథలుగా చెప్పుకున్నారు.
ఏమైతేనేం, ఆర్ధికంగా నాగబాబు నష్టపోవడాన్ని చూసి చలించిన పవన్ 'గబ్బర్ సింగ్" చిత్రాన్ని అతనికి చేసి, అన్నకు సహాయపడాలనుకున్నాడు. ఇప్పుడు 'తీన్ మార్" సక్సెస్ వల్ల ఆ ప్రభావం 'గబ్బర్ సింగ్" బిజినెస్ కి కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే, తమ్ముడికి హిట్ వచ్చిందన్న ఆనందంతో బాటు తనకు కూడా మంచి జరుగుతుందన్న ఆశతో ఆయన హ్యాపీ మూడ్ లో ఉన్నాడట!


Click it and Unblock the Notifications











