Vakeel Saabపై మెగా బ్రదర్.. ఎదురుచూపులకు తెర.. మ్యానియా షురూ అంటోన్న నాగబాబు!

పవన్ కళ్యాణ్ ఒక్క సారి తిరిగి వచ్చి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుందా? అని అందరూ అనుకున్నారు. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రికార్డులు బద్దలు కొడతాడని అభిమానులందరూ ఎదురు చూస్తూ వచ్చారు. మొత్తానికి వారి కల నేడు తీరిపోయింది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. రిపిటెడ్‌గా ఫ్యాన్స్ సినిమాను చూసేస్తున్నారు. వకీల్ సాబ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ అందరూ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు.

అందరూ అదే మాట..

అందరూ అదే మాట..

వకీల్ సాబ్ గురించి అందరూ ఒకే మాట చెబుతున్నారు. వకీల్ సాబ్‌లో పవన్ కళ్యాణ్ అరాచకం, సినిమా అదిరిపోయింది.. తమన్ ఇరగ్గొట్టేశాడు.. డైలాగ్స్ పేలిపోయాయ్ అంటూ అభిమానులు గాల్లో తేలిపోతోన్నారు. హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించారంటూ కామెంట్లు పెడుతున్నారు.

బెనిఫిట్, ప్రీమియర్స్ షోలు..

బెనిఫిట్, ప్రీమియర్స్ షోలు..

వకీల్ సాబ్ సినిమా కోసం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు బాగానే పడ్డాయి. అయితే వీటి కోసం అభిమానులే కాదు సెలెబ్రిటీలు సైతం కాచుకుని కూర్చున్నారు. టాలీవుడ్‌లో చాలా మంది సెలెబ్రిటీలు బెనిఫిట్ షోలను చూసేశారు. తాజాగా నాగబాబు కూడా ఉదయాన్నే వకీల్ సాబ్ సినిమాను చూసేశాడు.

ఉదయాన్నే పడిన షో..

ఉదయాన్నే పడిన షో..

నాగబాబు ఉదయం ఐదు గంటల ప్రాంతంలోనే వకీల్ సాబ్ సినిమాను చూసేశాడు. ఈ క్రమంలో సినిమాలోని పవన్ కళ్యాణ్ పేరు పడే సీన్, వకీల్ సాబ్ టైటిల్‌ను షేర్ చేస్తూ.. ఎదురుచూపులకు తెరపడింది.. అతని మ్యానియా షురూ అయిందంటూ కామెంట్ చేశాడు.

Recommended Video

Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
రికార్డుల మోత..

రికార్డుల మోత..

ఇక వకీల్ సాబ్ గురించి అందరూ ఒకే మాట చెబుతున్నారు. అసలైన సినిమా ఇదే.. రికార్డ్ కలెక్షన్లు ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.. కేవలం ప్రీమియర్స్‌తోనే దాదాపు 200K కలెక్షన్లను రాబట్టింది. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టేలా ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X