ఇది మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు.. నాగబాబు వాట్సప్ డీపీ అదేనట!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఆడే పరాచకాల గురించి అందరికీ తెలిసిందే. తనపై వచ్చే ట్రోలింగ్స్‌కు నాగబాబు ఇచ్చే కౌంటర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో నాగబాబు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాడు. అలాంటి నాగబాబు ఈ మధ్య తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా, సెటైరికల్‌గా స్పందిస్తూ రిప్లైలు ఇస్తుంటాడు. అలాంటి నాగబాబు తాజాగా మరోసారి తన ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అయ్యాడు.

తాజాగా అలా..
నాగబాబు కనీసం వారానికి ఒక్కసారైనా తన ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. గత రెండు వారాల్లో తన ఫాలోవర్లతో చేసిన చిట్ చాట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మీమ్స్‌ను ఉపయోగించి నాగబాబు ఇచ్చే రిప్లైలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. నిన్న కూడా నాగబాబు తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేశాడు.

ప్రతీసారి అంతే..
నాగబాబు ఎప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టినా కూడా ఆర్జీవీ, బాలకృష్ణ టాపిక్ రాకుండా ఉండదు. నెటిజన్లు సైతం వాటిపై ఎక్కువగా శ్రద్ద పెడుతుంటారు. అందుకే నాగబాబును ఎక్కువగా ఆర్జీవీ, బాలయ్యకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటారు.

తాజాగా అలా..
నాగబాబు నిన్న చేసిన చిట్ చాట్‌లోనూ బాలయ్య, ఆర్జీవీకి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. ఇందులో ఓ నెటిజన్ అడుగుతూ.. బాలయ్య మీరు రూం మేట్స్ అంటుంటారు కదా? మీ ఇద్దిరిది ఏ బ్రాండ్అంటూ ప్రశ్నను వదిలాడు. దానికి నాగబాబు కౌంటర్ వేస్తూ.. ధరించే దుస్తుల బ్రాండ్ ఫోటోలను షేర్ చేశాడు.

వాట్సప్ డీపీ..
మరో నెటిజన్ ఓ సీక్రెట్ గురించి అడిగాడు. వాట్సప్ డీపీ ఏంటి అని ఓ ఫాలోవర్ అడిగాడు. దానికి నాగబాబు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. ఓ ఫోటోను షేర్ చేసి అదే తన వాట్సప్ డీపీ అని చెప్పుకొచ్చాడు. అందులో వర్మ, బాలయ్య ఇద్దరూ కూడా ముచ్చట్లు పెడుతున్నారు.

కౌంటర్ వేశాడా?
అయితే నిజంగా నాగబాబు వాట్సప్ డీపీ అదేనా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఇద్దరి విషయంలోనూ నాగబాబు ఆ మధ్య చిందులు తొక్కాడు. ఈ ఇద్దరిని కూడా తన దైన శైలిలో ఏకిపారేశాడు. అయితే ఇది కేవలం నెటిజన్లను షాక్ ఇచ్చేందుకే మాత్రమే చెప్పి ఉంటాడని కొందరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











