నాగ చైతన్య 21
నాగార్జునకు అభిమానులలో ఆడవారే ఎక్కువశాతం ఉన్నారు. నిన్నే పెళ్లాడుతా సినిమాతో ఈ అభిమానులు ఇంకా ఎక్కువయ్యారు. ఇపుడు ఆయన జిరాక్స్ ఆయన కుమారుడు నాగచైతన్య. ఈయన జన్మదినం శుక్రవారం (నవంబర్ 23). శుక్రవారంతో 21లోకి అడుగుపెడుతున్నాడు. ఆయన తెరంగేట్రం ఎపుడు చేయనున్నారా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. హీరోయిన్ అనుష్క వద్ద యోగా నేర్చుకున్న నాగచైతన్య తెరంగేట్రం గత సంవత్సరమే అవుతుందనుకున్నప్పటికీ ఎందుకో వాయిదా వేశారు. నాగార్జున మిత్రుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ తెరంగేట్రం ఉన్నందుననే నాగచైతన్య తెరంగేట్రం వాయిదా పడిందని కూడా ఫిల్మ్ నగర్ వాసులు అనుకున్నారు. ఏదేమైనా నాగచైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications