సమంతను రిక్వెస్ట్ చేసి ఒప్పించిన నాగచైతన్య
నాగచైతన్య,సమంత కాంబినేషన్ లో గతంలో ఏ మాయ చేసావే చిత్రం వచ్చి సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. అలాగే తాజాగా సమంత హీరోయిన్ గా చేసిన దూకుడు చిత్రం రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.దాంతో నాగచైతన్య మళ్లీ సమంతనే తన 'ఆటోనగర్ సూర్య" చిత్రానికి హీరోయిన్ గా ఎన్నుకున్నాడు. తన చిత్రం దడ ప్లాప్ కావటంతో డైలమోలో పడ్డ నాగచైతన్య ..సమంతను పర్శనల్ గా రిక్వెస్ట్ చేసి మరీ ఒప్పించాడని తెలుస్తోంది. ఇక నాగచైతన్య-సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఆటోనగర్ సూర్య". దేవా కట్టా దర్శకుడు.
ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. హైదరా బాద్‌లో సినిమా ప్రారంభమైంది. హీరో,హీరోయిన్స్ పై తొలిసన్నివేశానికి కె.అచ్చిరెడ్డి క్లాప్‌నివ్వగా, ఎల్లోఫ్లవర్స్ అధినేత, నిర్మాత రమేష్ పుప్పాల కెమెరా స్విచ్చాన్ చేశారు. నేటినుంచి రెగ్యులర్ చిత్రీకరణ సాగుతోంది. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్ రెడ్డి, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, మధు, పృథ్వీ, గాంధీ, అజయ్‌ఘోష్ తది తరులు నటిస్తున్నా రు. సంగీతం: అనూప్, కెమెరా: శ్రీకాంత్, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కళ: రవీందర్, కథ- కథనం- మాటలు-దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











