నాగచైతన్య నెక్స్ట్ సినిమా డైరక్టర్ ?

By Staff

Naga Chaitanya
ఒక సినిమా కూడా పూర్తి చేయకుండానే నాగార్జున తనయుడు నాగచైతన్య పరిశ్రమలో హాట్ ప్రాపర్టీగా మారాడు. ఈ నేపధ్యంలో అతని రెండో సినిమాను ఎవరు డైరక్ట్ చేయనున్నారన్నది ఆసక్తి కరంగా మారింది. అయితే ఈ అవకాశం శ్రీను వైట్ల సాదించాడని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని శ్రీను వైట్ల సైతం ఈ రోజు మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వూలో కన్ఫర్మ్ చేసారు.

తండ్రి నాగార్జునతో కింగ్ సినిమాను రూపొందించిన శ్రీనువైట్ల..తనయుడు నాగచైతన్యతోనూ ఓ సినిమా రూపొందించటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. కింగ్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. నాగ్‌ వారసుడు నాగచైతన్యతో సినిమా చేస్తారని అంటున్నారు... అని వారడిగిన దానిక సమాధానంగా..అవును. ఇప్పటికే ఓ లైన్‌ వినిపించాను. బాగుంది అన్నారు. దానికి ఓ రూపం తీసుకొచ్చే పనిలో ఉన్నానన్నారు.

అలాగే విక్టరి వెంకటేష్ తో సినిమా అన్నారుగా ఎప్పుడు అంటే..త్వరలోనే ఉంటుంది. కథ కూడా వినిపించా. వెంకీకి నచ్చింది. అయితే 'కింగ్‌' విడుదలయ్యాక ప్రేక్షకులు అంచనాలు పెంచుకొనే అవకాశం ఉంది. అందుకే వాటికి తగ్గ కథని తయారుచేసి మళ్ళీ వినిపిస్తా. మెత్తానికి శ్రీను వైట్ల నాగ్ తోనూ ఆయన కుమారుడు నాగ చైతన్యతో ఆయన బావ వెంకటేష్ తో సినిమాలు వరస సినిమాలు చేస్తున్నారన్నమాట.ప్రస్తతం నాగ చైతన్య ...నూతన దర్శకుడు వాసు వర్మ డైరక్షన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. అతని సరసన ఒకప్పటి గ్లామర్ క్వీన్ రాధ కూతురు చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X