నాగచైతన్య హీరోయిన్ కాజల్ అగర్వాల్
నాగ చైతన్య తదుపరి చిత్రంలో హీరోయిన్ ఖచ్చితంగా కాజల్ అగర్వాలేనని తెలుస్తోంది. కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి శివప్రసాద రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగచైతన్యతో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన డిసెంబర్ లోనే అధికారికంగా వచ్చింది. హీరోయిన్ ను మాత్రం ఇప్పుడు ఖరారు చేశారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కొత్త దర్శకుడు అజయ్ భూయాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ చంద్ర సిద్ధార్ధ నిర్మించిన 'హౌస్ ఫుల్' చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగార్జునతో ఇదే బ్యానర్ తీసిన సినిమా త్వరలో విడుదల కానుంది. వారి రెండో సినిమా నాగ చైతన్యతోనే. నాగ చైతన్య సినిమా జులై నెలలో విడుదల కావచ్చు.
More from Filmibeat
నాగ చైతన్య కాజల్ అగర్వాల్ నాగార్జున కామాక్షి ఆర్ట్స్ నిర్మాత శివప్రసాద్ రెడ్డి nagachaitanya kajal agarwal kamakshi arts nagarjuna producer sivaprasad reddy


Click it and Unblock the Notifications











