ఎప్పుడు ఏ పాము నోట్లో పడతానో తెలియదు..నాగం జనార్ధన రెడ్డి
నేను రాజకీయరంగంలో ఉన్నాను.ఎప్పుడు పాము నోటిలో పడతానో తెలీదు అన్నారు నాగం జనార్ధన రెడ్డి.కృష్ణుడు తాజా చిత్రం 'వైకుంఠపాళి'సినిమా పాటల విడుదల కార్యక్రమంకి హాజరైన నాగం ఇలా స్పందించారు.అలాగే సినిమాగురించి చెపుతూ...నేను వినాయకుడు సినిమా చూశాను. చాలా బాగుంది. నేను ఏది ప్రారంభించినా మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకముంది అన్నారు.ఈ కార్యక్రమంలో సినిమా లోగోను తాషు కౌశిక్ ఆవిష్కరించారు. ఆడియో సిడిని కృష్ణుడు ఆవిష్కరించి నాగం జనార్ధన్ రెడ్డి కి అందజేయగా, నాగం జనార్ధన్ రెడ్డి ట్రైలర్స్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ 'వైవిధ్యమైన కాన్సెప్ట్ తో స్క్రీన్ ప్లే ప్రధానంశంగా రూపొందిస్తున్న చిత్రమిది.నలభై రెండు రోజుల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసి పూర్తి క్లారిటీతో చిత్రాన్ని రూపొందించాం.నేటి యువత తమ లక్ష్యాలను సాధించటానికి ఎంత వరకు ప్రయత్నిస్తున్నారు..వారు పయనిస్తున్న మార్గమేమిటి..అనే అంశాలను ఈ చిత్రంలో చర్చిస్తున్నాం.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కాలేజి నుంచి కొన్ని ఊహాలతో బయటకొచ్చిన యువకులకు సమాజంలో ఎదురైన పరిస్దితులేమిటి..వాటిని ఎలా ఎదుర్కొన్నారు..అనేది ఈ చిత్ర కధాంశం అన్నారు.హరేరామ హరేకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ గోపిరెడ్డి దర్శకుడిగా భువనేశ్వర మారన్,సత్య దీప రెడ్డి లు పెండంలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











