twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకెప్పుడు? తెలుగు సైరాట్ వస్తుందా రాదా..??: సమాధానం ఇదే

    "సైరాట్" రీమేక్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ తెరకెక్కబోతోంది. ఇప్పటికే నటీనటులు కూడా ఖరారైపోయారని.. త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు.

    |

    మహారాష్ట్ర లో ఎవరూ ఊహించని విధంగా మరాఠీలో వచ్చిన ఒక సినిమా సంచలనాలు సృష్టించింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన "సైరాట్" మూవీ అక్కడ ఏకంగా రూ 100 కోట్ల మార్కును దాటేసింది. అంటే పెట్టుబడి మీద దాదాపు 25 రెట్ల వసూళ్లన్నమాట.

    నాగరాజ్ మంజులే

    నాగరాజ్ మంజులే

    నూతన నటీనటులు ఆకాష్, రింకూ రాజ్ గురు హీరో హీరోయిన్లుగా నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మామూలుగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు ఉండవంటారు. కానీ ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో "స్పెషల్ జ్యూరీ" పురస్కారం అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గానూ సూపర్ సక్సెస్ అయింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పుంజుకుని రెండో వారం నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్లతో అదరగొట్టింది.

    రీమేక్ హక్కులు

    రీమేక్ హక్కులు

    ‘సైరాట్'ను పలు భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్నాడు కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. కన్నడలో ఆల్రెడీ రీమేక్ పనులు మొదలైపోయాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ రీమేక్ తెరకెక్కబోతోంది. ఒరిజినల్ తీసిన నాగరాజ్ మంజులేనే తెలుగు-తమిళ వెర్షన్లకూ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట.

    తెలుగు వెర్షన్

    తెలుగు వెర్షన్

    ఇప్పటికే నటీనటులు కూడా ఖరారైపోయారని.. త్వరలోనే ప్రకటన వస్తుందని అంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి రాక్ లైన్ రీమేక్‌ను నిర్మించబోతున్నాడు. ఇంకొన్ని రోజుల్లోనే ‘సైరాట్' తెలుగు వెర్షన్ గురించి ప్రకటన వస్తుందట. హిందీలో శ్రీదేవి తనయురాలు జాన్వి ‘సైరాట్' రీమేక్‌లో నటిస్తుందని సమాచారం.

    విషయం ఉంటే చాలు

    విషయం ఉంటే చాలు

    సినిమాలో విషయం ఉంటే చాలు. బడ్జెట్ ఎంత? నటులు ఎవరు? ఇవన్నీ సంబంధం లేకుండా హిట్ అవుతుందని ప్రూవ్ చేసింది సైరాట్ మూవీ. మనోళ్లు కూడా ఓ ఎగబడి బడ్జెట్ పెట్టేసి ఆ తర్వాత బాధపడకుండా, లిమిట్ లో మంచి కథను నమ్మి సినిమా తీస్తే, ఇండస్ట్రీ లాభాల బాట పట్టడమే కాక, మంచి సినిమాలు కూడా వస్తాయి.

    English summary
    Nagaraj Manjule, who directed the Marathi version, is in contention to helm the South remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X