twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూన్ 17న మా ‘నగరం నిద్రపోతున్న వేళ’..

    By Sindhu
    |

    గత 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతూ ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నంది శ్రీహరి తొలిసారిగా చలన చిత్ర రంగంలోకి అడుగుపెట్టి ఓ వైవిధ్యభరితమైన, సందేసాత్మకమైన చిత్రాన్ని నిర్మించారు. గురుదేవ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై జగపతిబాబు,ఛార్మి ప్రధాన పాత్రదారులుగా ప్రేమ రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 17 న విడుదలకు సిద్దమవుతున్నది.

    చిత్ర నిర్మాత నంది శ్రీహరి మాట్లాడుతూ 'రియల్ ఎస్టేట్ రంగంలో 15 సంవత్సరాలుగా ఉంటున్నాను. తొలిసారిగా చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతు 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రాన్ని నిర్మించాను. మా దర్శకుడు ప్రేమ రాజ్. నాకు రెండు మూడు కధలు వినిపించారు కాని నాకు ఇలా కాదు డిఫరెంట్ కధలు కావాలన్నాను. ఒకరోజు రచయిత దీన్ రాజ్ తీసుకొచ్చి చెప్పిన కధ చాలా బాగా నచ్చింది. ఆ తరువాత పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి వారికి ఈ కధని వినిపించాము. వారు చాలా అద్భుతంగా వుంది వెంటనే మొదలు పెట్టండి అన్నారు. అలా వారు చెప్పడంతో దీనిని చెయ్యడం జరిగింది.

    ఈ చిత్రం 90 శాతం రాత్రివేళ షూటింగ్ జరిగింది. 'నగరం నిద్రపోతున్న వేళ' ఏం జరిగుతుంది అన్నది చాలా బాగా చూపించారు మా దర్శకుడు. ఇక హీరోయిన్ఛార్మిది జర్నలిస్ట్ పాత్ర. తను పాత్రలో నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. ఇక హీరో జగపతి బాబు ఇందులో కధానాయకుడిగా ఓ అద్భుతమైన పాత్రను చేసారు. ప్రస్తుతం డి.టి.ఎస్. కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 17 న సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు.

    English summary
    Charmi is acting in the key role in the movie Nagaram Nidra Potuna vela presented by Guru Deva Creations Pvt Ltd directed by Prem Raj and produced by Nandi Sri Hari is all set to release June 17. Charmi plays the role of a daring and dashing journalist. This is a social thriller and most of the movie is shot in night effect.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X