పైరసీకి పాల్పడిన డిస్ట్రిబ్యూటర్
ఆయనకదేం బుద్దో కానీ మచ్చక్కరన్ సినిమాను విసిడీలను పైరేట్ చేయడానికి సిద్ధపడి పోలీస్ కేసుల పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నాగరవి అనే డిస్ట్రిబ్యూటర్ మచ్చక్కరన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ కూడా. దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్ లో మచ్చక్కరన్ సినిమాను ప్రదర్శించారు. నాగరవి ఒక వీడియో కెమరాతో ఆ సినిమాను షూట్ చేస్తున్నాడు. ఆయనిలా చేస్తుండగానే విషయం తెలిసిన ఈ సినిమా దర్శకుడు, నిర్మాత లు అక్కడికి చేరుకున్నారు. వారువచ్చారని తెలిసిన నాగరవి అక్కడినుంచి జారుకున్నాడు. కోపం పట్టలేకపోయిన ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు కలిసి నాగరవి కారును ద్వంసం చేశారు. ప్రివ్యూ థియేటర్ నూ ద్వంసం చేశారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాగరవిపై కేసు పెట్టారు. మరోవైపు దేవి శ్రీదేవి థియేటర్ ఓనర్ కూడా దర్శక, నిర్మాతలపై కేసు నమోదు చేశాడు. సినిమాను పైరసీ చేయడానికి ప్రయత్నించిన నాగరవిని సినిమా ఫీల్డ్ లో లేకుండా చేయాలని సదరు దర్శక,నిర్మాతలు తమ ప్రయత్నాలను మొదలెట్టారు.


Click it and Unblock the Notifications











