కౌబాయ్ గెటప్‌లో అనుష్క, నాగార్జున
నాగార్జున, అనుష్క త్వరలో కౌబాయ్ గెటప్ లలో కనపడనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న 'రగడ" అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 6నుంచి 17వరకు బ్యాంకాక్‌ని చుట్టొచ్చింది. ఆ విశేషాలను నిర్మాత మీడియాకు వివరించారు. నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం అక్కడ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించడంతో ఒక పాట మినహా చిత్రం పూర్తయిందనితెలిపారు. అలాగే ప్రపంచంలోనే మూడవ అద్భుతం అని చెప్పే జోర్డాన్‌లోని పెట్రోలో అక్టోబర్ 13నుంచి 22వరకు షెడ్యూల్‌ని జరిపాం. యువ సంగీత దర్శకుడు తమన్ ట్యూన్స్‌కి రాజు సుందరం చిత్రీకరణకి, కెమెరామెన్ సర్వేష్ పనితనంతో విజువల్ గ్రాండియర్‌కు మరో అర్థంగా పాటల చిత్రీకరణ జరిగింది. కౌబాయ్ గెటప్‌లో అనుష్క, నాగార్జున ఈ పాటల్లో పాల్గొన్నారు. ఈ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయిఅన్నారు.
అలాగే . జోర్డాన్ యువరాజు అలీ, యువరాణి సిటరీమ్ ఆత్మీయంగా కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ యూనిట్‌ని ఆహ్వానించి ఆతిథ్యం అందజేయడం ప్రత్యేకంగా పేర్కొనవలసిన విషయం""అని చెప్పారు. డిసెంబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియమణి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, రఘుబాబు, ప్రదీప్‌రావత్, దేవ్‌గిల్, సుశాంత్‌సింగ్, సత్యప్రకాష్, సుప్రీత్, శ్రావణ్, డా.్భరత్‌రెడ్డి, రఘు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: తమన్ ఎస్., నిర్వహణ: కె.చెంచురెడ్డి, సహనిర్మాతలు: డి.విశ్వచందన్‌రెడ్డి, డి.వెంకటకైలాష్‌రెడ్డి, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరు పోట్ల. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











