»   » అన్ని విషయాలు విప్పిన నాగార్జున... (బర్త్ డే ఇంటర్వ్యూ)

అన్ని విషయాలు విప్పిన నాగార్జున... (బర్త్ డే ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ మన్మదుడు నాగార్జున నేడు(ఆగస్టు 29)న 58వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. తన తాజా సినిమా రాజుగారి గది 2, అఖిల్ నటిస్తున్న 'హలో' మూవీ, చైతన్య-సమంత పెళ్లి గురించిన విషయాలపై మనసు విప్పి మాట్లాడారు.

'రాజుగారి గది 2' గురించిన వివరాలు వెల్లడిస్తూ... ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోందని తెలిపారు. ఇది హారర్‌ కామెడీ థ్రిల్లర్‌. సినిమాలో నా సైడ్‌ నుంచి కామెడీ తక్కువగా ఉంటుంది. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌ సిట్యుయేషనల్‌ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందని తెలిపారు.

మెంటలిస్టు పాత్ర

మెంటలిస్టు పాత్ర

'రాజుగారి గది 2' మూవీలో నేను మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిసాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ వుంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక పది ప్రశ్నలు అడిగి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు. అదేమీ మ్యాజిక్‌ కాదు, అబ్జర్వేషన్‌ పవర్స్‌ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది' అని నాగార్జున తెలిపారు.

Raju Gari Gadi 2 movie launch | Akkineni Nagarjuna | Telugu Filmibeat
దానికి దీనికి సంబంధం లేదు

దానికి దీనికి సంబంధం లేదు

రాజుగారిగది సినిమాకి, ఈ పార్ట్‌2కి సంబంధమే లేదు. ఆ టైటిల్‌ తీసుకోవడానికి కారణం బాగా పాపులర్‌ అయిన సినిమా. ఆ జోనర్‌ అందరికీ తెలిసింది. అందుకే ఆ టైటిల్‌ పెట్టడం జరిగిందని నాగార్జున తెలిపారు.

అఖిల్ ‘హలో' గురించి

అఖిల్ ‘హలో' గురించి

‘హలో' చిత్రాన్ని విక్రమ్‌ చాలా ప్లాన్డ్‌గా సినిమా చేస్తున్నారు. ఆయన క్రియేటివ్‌గా సినిమాని బాగా తీస్తారు. సినిమా చాలా బాగా వస్తోంది. సినిమాకు ‘హలో' టైటిల్ పెట్టడానికి కారణం తను ప్రేమించిన అమ్మాయి దగ్గర నుంచి ఒక హలో కోసం వెయిట్‌ చేస్తుంటాడు. ఇది నేను ఇచ్చిన టైటిల్‌. ఆరు నెలల నుంచి యూనిట్‌ అంతా ఏం టైటిల్‌ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో నాకు వెంటనే ఆ టైటిల్ థాట్ వచ్చిందని నాగార్జున తెలిపారు.

ఎన్టీఆర్, అఖిల్ మంచి ఫ్రెండ్స్

ఎన్టీఆర్, అఖిల్ మంచి ఫ్రెండ్స్

ఎన్‌.టి.రామారావుగారితో స్టార్ట్‌ చేయించి నాన్నగారితో కంప్లీట్‌ చేసి 'హలో' టైటిల్‌ లాంచ్‌ చేయించాలనుకున్నాం. పెద్దాయన లేరు కాబట్టి తారక్‌ని అడిగాం. తారక్‌, అఖిల్‌ మంచి ఫ్రెండ్స్‌. అందుకే ఎన్టీఆర్‌తో స్టార్ట్‌ చేశామని నాగార్జున తెలిపారు.

‘హలో' లేటవ్వడానికి కారణం

‘హలో' లేటవ్వడానికి కారణం

హీరోయిన్ విషయంలోనే ‘హలో' లేటవుతూ వచ్చింది. ముందు పియదర్శన్‌గారి అమ్మాయిని స్క్రీన్‌ టెస్ట్‌ చేసిన తర్వాత 30, 40 మందిని చేశాం. గీతాంజలిలో గిరిజలా, ఏమాయ చేసావెలో సమంతలా కొత్తగా వుండాలనుకున్నాం. చివరికి ప్రియదర్శన్‌గారి అమ్మాయి కళ్యాణినే సెలెక్ట్‌ చేశామని నాగార్జున తెలిపారు.

ఈ సినిమాకు ఖర్చు కాస్త ఎక్కువే

ఈ సినిమాకు ఖర్చు కాస్త ఎక్కువే

నా కుమారుల సినిమాలు నేనే తీయడం అంటే అందులో ప్రేమ కూడా తప్పకుండా ఉంటుంది. ప్రేమ ఉన్న‌చోట కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. అఖిల్‌ ‘హలో' సినిమా కొంచెం కాంప్లికేటెడ్‌. బడ్జెట్‌ ఎక్కువవుతోంది. ఖర్చనేది తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే సబ్జెక్ట్‌ అలాంటిదని నాగార్జున తెలిపారు.

సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్

సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్

‘సోగ్గాడే చిన్ని నాయనా' తర్వాత బంగర్రాజు క్యారెక్టర్ తో ఓ సినిమా చేయాలనుకున్న మాట నిజమే. ఆ క్యారెక్టర్ కు మంచి పాపులారిటీవచ్చింది. నాకూ అలాంటివి చేయడం అంటే ఇష్టం. కళ్యాణ్‌కృష్ణ ఒక లైన్‌ చెప్పాడు. అంతగా నచ్చలేదు. మళ్ళీ ప్రిపేర్‌ అయి మంచి కథ చెప్తే తప్పకుండా చేస్తాను. అయితే అది 'సోగ్గాడే చిన్నినాయనా'కు సీక్వెల్‌ మాత్రం కాదని నాగార్జున స్పష్టంచేశారు.

మహాభారతం చేస్తానో? లేదో? తెలియదు

మహాభారతం చేస్తానో? లేదో? తెలియదు

మోమన్ లాల్ మూవీ మహాభారతంలో నటించమని నన్ను అడిగిన మాట వాస్తవమే కానీ ఆ సినిమా చేస్తానా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేను. అందులో కర్ణుడి పాత్ర చెయ్యమని అడిగారు. ఆ సినిమా 2018లో స్టార్ట్‌ అయ్యే అవకాశాలున్నయిన నాగార్జున తెలిపారు.

చైతన్య-సమంత పెళ్లి గురించి

చైతన్య-సమంత పెళ్లి గురించి

అక్టోబర్‌ 6న చైతన్య-సమంత పెళ్ళి. ఒకేరోజు క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయాల్లో పెళ్ళి చేస్తున్నాం. పెళ్ళి సింపుల్‌గా చెయ్యాలని వాళ్ళే అనుకున్నారు. ఆ తర్వాత రిసెప్షన్‌ గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నామని నాగార్జున తెలిపారు.

English summary
Check out Nagarjuna 58th birthday interview. Tollywood Manmadhudu Nagarjuna turns 58 today. Akkineni Nagarjuna is an Indian film actor, producer and television presenter who works primarily in the Telugu cinema, and television.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu