పైరసీ కుర్రాడు: అఖిల్‌ని గుర్తు చేసుకున్న నాగార్జున
హైదరాబాద్ : 'శిరిడి సాయి' చిత్రాన్ని పైరసీ చేస్తూ పట్టుబడిన 19 సంవత్సరాల కుర్రాడిని చూసి తన చిన్న కుమారుడు అఖిల్‌ను గుర్తు చేసుకున్నారు హీరో అక్కినేని నాగార్జు. ఇటీవల ఎ.వి.అశోక్ వర్మ అనే 19 ఏళ్ల యువకుడు శిరిడి సాయి చిత్రం పైరసీ చేస్తూ పట్టుబడ్డాడు.
ఈ సందర్భంగా నాగార్జున అఖిల్‌ను గుర్తు చేసుకుంటూ.... మా చిన్నాబ్బాయి అఖిల్ కూడా అతని వయసు వాడే, యంగస్టర్స్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పాలు పంచుకోవడం బాధగా ఉంది, వారికి ఎంతో జీవితం ఉంది, ఇలాంటి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
శిరిడి సాయి చిత్రానికి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.
ప్రస్తుతం నాగార్జున 'లవ్ స్టోరీ' షూటింగులో పాల్గొంటున్నారు. అక్కినేని నాగార్జున, నయనతార జంటగా దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











