twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అర్జున్ రెడ్డి’.... ముద్దు సీన్లపై, బూతులపై నాగార్జున కామెంట్!

    ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై నాగార్జున స్పందించారు. తాను ఇంకా సినిమా చూడలేదని తెలిపారు.

    By Bojja Kumar
    |

    విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఇటీవల విడుదలై బక్సాఫీసు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ టాక్, కలెక్షన్లు ఎంత బావున్నాయో... బయట సినిమాపై విమర్శలు కూడా అదే రేంజిలో ఉన్నాయి.

    సినిమాలో ముద్దు సీన్లు మరీ ఓవర్‌గా ఉన్నాయని, బూతులు ఉన్నాయంటూ సినిమాపై ప్రచారం జరుగుతోంది. తాజాగా బర్త్ డే ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వగా తనదైన రీతిలో స్పందించారు.

    ట్రెండ్ సెట్టర్ మూవీ అంటున్నారు

    ట్రెండ్ సెట్టర్ మూవీ అంటున్నారు

    ‘అర్జున్ రెడ్డి' సినిమా నేను ఇంకా చూడలేదు, ట్రెండ్ సెట్టర్ మూవీ అని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత దానిపై తన అభిప్రాయం వెల్లడిస్తాను అని నాగార్జున తెలిపారు.

    ముద్దు సీన్లపై..

    ముద్దు సీన్లపై..

    సినిమాలో 20కి పైగా ముద్దు సీన్లు ఉన్నాయి...తెలుగులో ఇంత అవసరమా? అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ ‘హిందీలో ఎప్పటి నుండో ముద్దు సీన్లు వస్తున్నాయి. హిందీలో ఉన్నపుడు తెలుగులోనూ అలాంటి సినిమాలు రావడంలో తప్పులేదు. వాళ్లు, మనం ఒకటే దేశం, ఒకటే మనుషులం అయినప్పుడు తప్పేంటి' అని నాగార్జున వ్యాఖ్యానించారు.

    బూతుల గురించి

    బూతుల గురించి

    సినిమాలో క్యారెక్టర్‍‌కు, సందర్భానుసారంగా అవసరం అనుకుంటే బూతులు పెట్టడంలో తప్పేమీలేదు. మనం బయట కూడా బూతులు మాట్లాడుకుంటాం..... ఈ విషయంలో డబల్ స్టాండర్డ్స్ ఎందుకు? అని నాగార్జున అన్నారు.

    పిల్లల్ని పంపకండి

    పిల్లల్ని పంపకండి

    సినిమా నేనే ఇంకా చూడలేదు, మీకు సినిమాలో బూతులు, ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే, అవి మీ పిల్లలు చూడకూడదను అనుకుంటే వారిని పంపకండి, ఎందుకంటే సినిమాకు ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చూడకుండా దీని గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు అని నాగార్జున తెలిపారు.

    సందర్భంతో సంబంధం ఏమిటి? ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారుగా

    సందర్భంతో సంబంధం ఏమిటి? ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారుగా

    వినాయక చవితి సందర్భంగా ఇలాంటి సినిమాను విడుదల చేయడం ఏమిటి? అనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని నాగార్జునను ప్రశ్నించగా....... సినిమాకు ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. దీనికి సందర్భంలో సంబంధం లేదు అని నాగార్జున అభిప్రాయ పడ్డారు.

    English summary
    "Tollywood actor Nagarjuna said that public talk is Arjun Reddy is a trendsetting movie in Telugu industry. To a question, the actor said that censor board gave A certificate to Arjun Reddy and children should not be allowed to watch the movie." Nagarjuna said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X