నిర్ణయం బాలయ్యకే వదిలేశా: నాగార్జున
నాకూ చేయాలనుంది. ఈ మధ్య బాలయ్యను కలిసినపుడు అదే విషయం మాట్లాడు కున్నాం. శ్రీరామరాజ్యం అయ్యాక వర్కవుట్ చేద్దామనుకున్నాం. ఈలోగా తారక్ (జూ.ఎన్టీఆర్) ఫోన్‌చేసి నాగచైతన్యతో కలిసి గుండమ్మ కథ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. వాళ్ల ప్రాజెక్టు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు నాగార్జున.ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించారు. మీరు బాలకృష్ణ కలిసి నటించ లేదే అని నాగార్జునని ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ వారు అడిగితే ఆయన ఇలా స్పందించారు.అలాగే తమ కాంబినేషన్ లో సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నానని, అయితే, ఏ సినిమా చేయాలో బాలయ్యకే వదిలేశానని అన్నారు.అలాగే మీరు, నాగేశ్వరరావు గారు, చైతన్య కలిసి చేసేకథను కృష్ణవంశీ సిద్ధం చేశారట కదా అని అడిగితే..అవును. కానీ, సెకండాఫ్ నాకు నచ్చలేదు. మళ్లీ చేసుకొస్తానన్నాడు అని కూల్ గా సమాధానమిచ్చారు.ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్ధితిని గురించి మాట్లాడుతూ... మార్కెట్ రూ.20 కోట్లుంటే రూ.30 కోట్లతో డైరెక్టర్ సినిమా తీయడమేంటండి బుద్ధి లేకుండా. ఇప్పుడున్న దర్శకుల్లో రాజమౌళిని అభినందిస్తా అన్నారు.


Click it and Unblock the Notifications