నా కెరీర్లోనే హై రేంజ్ మూవీ: నాగార్జున
కింగ్ నాగార్జున హీరోగా కె. అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డా. వెంకట్ నిర్మిస్తున్న 'డమరుకం' చిత్రం జూలై రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ....'నా కెరీర్లోనే మొదటి సారి ఇలాంటి ఫాంటసీ మూవీ చేస్తున్నాను. హై టెక్నికల్ వేల్యూస్‌తో చేశారు. నా కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది' అన్నారు.
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ...'ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. నాగార్జున కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ అవుతుంది. జులై రెండో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'నాగార్జున కెరీర్లోనే ఇదో పెద్ద లాండ్ మార్క్ అవుతుంది. నిర్మాత వెంకట్ ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారు' అని చెప్పారు. కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాుడుతూ...'ఒక వైపు పోస్టు ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి' అని చెప్పారు.
నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజా శ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: చోటాకె నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: వెంకట్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి


Click it and Unblock the Notifications











