Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ ముద్దు సీన్ కట్ చేస్తారని టెన్షన్ పడ్డా, అది లేకపోతే అంతే: నాగార్జున
నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' అప్పట్లో పాత్ బ్రేకింగ్ మూవీ. అసలు లిప్ లాక్ ముద్దు సీన్లు లేని రోజుల్లో నాగార్జున రెండున్నర నిమిషాల ముద్దు సీన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ 'మన్మధుడు 2' మూవీలో ముద్దు సీన్లతో రచ్చ చేయబోతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ... గీతాంజలి మూవీని గుర్తు చేసుకున్నారు. 'గీతాంజలి ముద్దు సీన్ సినిమాకు ఎంతో కీలకం. కానీ అప్పట్లో సెన్సార్ బోర్డు వారు ఆ సీన్ తీసేస్తారేమో అని భయపడ్డాం. ఒక వేళ వారు అ పని చేసి ఉంటే సినిమాపై చాలా ప్రభావం పడి ఉండేది. కానీ అలా జరుగలేదు' అన్నారు.
అప్పట్లో ఆ సీన్ చూసి నాన్నగారు ఏమంటారో అనుకున్నా...
అప్పట్లో గీతాంజలి సినిమా రిలీజ్ ముందు నాన్నగారు చూశారు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం కూడా మాలో ఉంది. షో మొదలవ్వడానికి ముందే నాన్నగారికి ఈ విషయం చెప్పాను. ఎలాంటి బ్రేక్ లేకుండా రెండున్నర నిమిషాలు తీసిన షాట్ అది, సినిమాకు అది ఎంతో కీలకం అనిచెప్పాను. స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత సినిమాలో అది బెస్ట్ సీన్ అని చెప్పారు. సెన్సార్ బోర్డ్ వారు ఆ సీన్ తీసేయరు అనే ధైర్యం ఇచ్చారు.... అని నాగార్జున ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
గీతాంజలి
గీతాంజలి , 19 మే 1989 లో విడుదలైంది. మణిరత్నం తెలుగులో చేసిన ఏకైక స్ట్రైట్ మూవీ ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం మరియు మలయాళం భాషలలోకి కూడా అనువదించడి సూపర్ హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
మన్మధుడు 2లో రొమాంటిక్ విశ్వరూపం
‘మన్మధుడు 2' మూవీలో నాగార్జున తన రొమాంటిక్ విశ్వరూపం చూపించబోతున్నాడు. ఇందులో ఆయన ప్లే బాయ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నాగ్ ముద్దుల్లో మునిగితేలిన సన్ని వేశాలు ట్రైలర్ మొత్తానికే హైలెట్ అయ్యాయి.
మన్మధుడు 2
నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం మన్మథుడు 2. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.