twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుష్మనీకొస్తే గుడ్‌బాయ్‌: నాగార్జున

    By Srikanya
    |

    హైదరాబాద్ : హైదరాబాద్‌ బిర్యానీ కంటే.. భాయ్‌కే ఘాటెక్కువ. మన అనుకొంటే మమకారాన్ని పంచుతాడు.. లేదంటే మెడలు వంచుతాడు. 'దోస్తీకొస్తే భాయ్‌.. దుష్మనీకొస్తే గుడ్‌బాయ్‌..' అనేది భాయ్‌ మాట, బాట. మరి ఈ ప్రయాణంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు హీరో నాగార్జున. ఆయన హీరోగా నటించినన చిత్రం 'భాయ్‌'. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్.

    దర్శకుడు మాట్లాడుతూ ''నాగార్జున శైలికి సరిపోయే కథ ఇది. భాయ్‌గా ఆయన నటన, పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మరోసారి మంచి బాణీలను అందించారు. మాస్‌, క్లాస్‌ అందరినీ అలరించే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది''అన్నారు. అన్నపూర్ణ స్డూడియోస్‌ సంస్థ నిర్మించింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. ఈవారంలోనే పాటల్ని విడుదల చేస్తారు. దసరాకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

    ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్ కి మంచి స్పందన లభించింది. దాంతో ఈ చిత్రం అక్టోబర్ 4 న విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం అత్తారింటికి దారేది విడుదల ముందుకు రావటంతో రిలీజ్ వెనక్కి వెళ్లింది. అక్టోబర్ 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే చిత్రం ఆడియోని అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఇంకా ప్రకటన రాలేదు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సాయిబాబు మాట్లాడుతూ "ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. సినిమా రిలీజ్ డేట్‌ను కొద్ది రోజుల్లో ప్రకటిస్తాం'' అని తెలిపారు.

    ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

    English summary
    Earlier Nagarjuna’s Bhai was slated for October 4th release. But since the release of Attarintiki Daredhi was advanced, the makers of Bhai decided to come on October 9th and enter Dussehra fray. The movie shooting is complete and the post production works are going on at full swing. The audio release function will be on October 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X