చూసేందుకు క్లాస్‌గా కనిపిస్తున్నానా..?: నాగార్జున

By Srikanya

హైదరాబాద్ : 'చూసేందుకు క్లాస్‌గా కనిపిస్తున్నానా..? పక్కా మాస్‌' అని అంటున్నారు నాగార్జున . ఈ డైలాగ్‌కి తగ్గట్టే తాను 'డమరుకం' లో మాస్‌ పాత్రలో కనిపిస్తానని చెప్తున్నారు. అలాగే భగవంతుడికీ భక్తుడికీ మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పేందుకు ఎన్నో లీలలు మనకి తార్కాణాలుగా ఉన్నాయి. ఆధునిక యుగంలోనూ దైవత్వం, మహిమల గురించి వింటూనే ఉన్నాం. మరి మా కథలో ఏయే అంశాల్ని స్పృశించామో తెర మీదే చూడమంటున్నారు నాగార్జున.

అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. వెంకట్‌ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. అక్టోబరు 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''నాగార్జున తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటించారు. గంటకిపైగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అవి కనువిందు చేస్తాయి.. సోషియో ఫాంటసీ తరహా అంశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. మనవైన ఆచారాలు, సంప్రదాయాలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటే వాటిని కాపాడేందుకు ఒకరు ఉద్భవిస్తారనే విషయాన్ని అంతర్లీనంగా ఇందులో చెబుతున్నాం. నాగార్జున నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది'' అన్నారు.

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇండియన్ స్క్రీన్‌పై ముందెన్నడూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూడొచ్చని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చెప్పారు. నాగార్జున కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా వెంకట్ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

''ఇటీవల విడుదల చేసిన గీతాలకు మంచి స్పందన వచ్చింది. నాగ్‌, అనుష్కల పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి'' అన్నారు నిర్మాత. విడుదలకు ముందే ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X