ప్రళయం సంభవిస్తుందనే అంశంతో... : నాగార్జున
అలాగే "చందమామ, అమరచిత్రకథల తరహాలో ఉండే కథ 'డమరుకం'. కథ చాలా బాగుంటుంది. ప్రేక్షకులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ కారణంగానే ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. ఈ విషయంలో నిర్మాత వెంకట్ ఏ మాత్రం రాజీ పడకుండా గొప్పగా గ్రాఫిక్స్ చేయించారు. సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదలవుతాయి. నాకు ఇది తొలి సోషియో ఫాంటసీ. పైగా నాకు తెలిసి తెలుగులో ఈ తరహా సినిమా ఎవరూ చేయలేదు'' అని నాగార్జున చెప్పారు.
కె. అచ్చిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తయైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, గణేశ్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, జీవా, కృష్ణభగవాన్, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్ తదితరులు తారాగణమైన ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి. సురేశ్‌రెడ్డి.
ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' చిత్రంలో నటిస్తున్న అక్కినేని నాగార్జున అది పూర్తయిన వెంటనే 'భాయ్' అనే సినిమా చేయబోతున్నారు. 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' వంటి వరుస హిట్లతో అందరి దృష్టినీ ఆకట్టుకున్న వీరభద్రం చౌదరి ఈ సినిమాకి దర్శకుడు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ బేనరుపై నాగార్జున స్వయంగా నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications












