‘గగనం’..లో నాగార్జున క్యారెక్టర్ ఏమిటంటే...
నాగార్జున హీరోగా రాధామోహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 'గగనం". ఈ చిత్రం నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ..విమానం హైజాక్, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది. గగనంలో కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్ హైజాగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్ అని చెప్పాలి. మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది. ఇక నుంచి నా చిత్రాలన్నిటికీ అచ్చ తెలుగు పేర్లు మాత్రమే ఉంటాయి అన్నారు. ఇక ఈ రోజు నాగార్జున పుట్టినరోజు. ఆయనకు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











