మూడు తరాల చిత్రం గురించి నాగ్ వివరణ
జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో వెక్టార్ సిస్టమ్స్, ఏఎమ్‌ఎక్స్‌ల ఆధ్వర్యంలో ఆడియో వీడియో పరిష్కారాలనందించే భవిష్యత్తు ఆధునిక పరిజ్ఞాన కేంద్రాన్ని నిర్వాహకులు శేషారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నాగార్జున మీడియాతో స్పందించారు. అలాగే గ్రీకువీరుడు చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు.
గ్రీకువీరుడు గురించి చెప్తూ....ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల మూలంగా వాయిదా వేయాల్సి వచ్చింది. నేను ఇటీవలే స్పెయిన్ వెళ్లి వచ్చాను. ఇందులో ప్రత్యేకమైన గ్రాఫిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రతి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. మే 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం అని చెప్పారు.
అఖిల్ ఎంట్రీ గురించి చెప్తూ... అఖిల్ సినిమాల్లోకి వచ్చే విషయం ఇంకా నిర్ణయించుకోలేదు. అయినా పిల్లల ఇష్టాఇష్టాల విషయంలో జోక్యం తక్కువ. ఇంకా ఆ విషయం గురించే ఆలోచించలేదు అన్నారు. తన కొత్త గెటప్ గురించి చెప్తూ... ఇప్పుడు చూస్తున్న గెటప్ గ్రీకువీరుడు. తర్వాత భాయ్ చిత్రం చేయబోతున్నాను. వేచిచూడాలి.. ఆ చిత్రంలో ఎలా ఉంటానో మరి(నవ్వుతూ) అన్నారు.
ఇక ఇప్పుడు రోజూ ఒకే పాటను ఎక్కువగా హమ్ చేస్తున్నాను. గ్రీకువీరుడు చిత్రంలోని 'ఐ హేట్ లవ్' అనే పాటను. ఇక ఈసారి వేసవిలో షూటింగ్‌లతోనే బిజీగా ఉండే అవకాశం ఉంది. దీనికితోడు కొత్తప్రదేశాలను చుట్టిరావడం నాకు ఎక్కువగా సరదా. ధోనితో కలిసి ఏర్పాటుచేసిన మహి రేసింగ్ సూపర్ బైక్ టీమ్ ద్వారా ఇటీవల స్పెయిన్‌లో ఆయా స్పోర్ట్స్‌ను చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












