'రగడ' సినిమా నాగార్జున చేయటానికి కారణం!?

By Srikanya

నేను ఎటువంటి సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నానో సరిగ్గా అలాంటి కథతో దర్శకుడు వీరు నా దగ్గరికి వచ్చాడు. అలాగే అతను రాసిన డైలాగ్స్ బాగా నచ్చాయి. క్యాచీగా ఉండే డైలాగులవి. అందుకే ఈ చిత్రం చేయటానికి ఒప్పుకున్నాను అన్నారు నాగార్జున. ఆ తర్వాత వీరు పోట్ల దర్శకత్వం వహించిన బిందాస్ చూశాను. బాగా తీశాడనిపించింది. మాస్‌ని బాగా ఎలివేట్ చేసాడు. కొంత కాలంగా హలో బ్రదర్, ఘరానా బుల్లోడు లాంటి మాస్ తరహాలో ఉన్న సినిమా చేయాలని అనుకుంటున్నాను. వీరు పోట్ల ఈ కథ చెప్పగానే ఆ చిత్రాల్లా ఉందనిపించి ఒప్పుకు న్నాను. తను రాసిన డైలాగులు బాగా నచ్చాయి అన్నారు.

సినిమా బాగా తీశాడు. గ్యారంటీగా ప్రేక్షకులకు కావల్సినంత వినోదం ఇచ్చే చిత్రం అవుతుంది అంటూ ఆయన తాజా చిత్రం 'రగడ' గురించి మీడియాకు చెప్పారు నాగార్జున. కథ గురించి చెపుతూ..కడప మార్కెట్‌లో మొదలై హైదరాబాద్ చేరుకునే పాత్ర నాది. రాయలసీమలో ఇప్పటి యూత్ ఎలా మాట్లాడతారో సినిమాలో నా డైలాగ్ డెలవరీ అలా ఉంటుంది. ఆ ప్రాంతపు పొగరు, పౌరుషం ఈ పాత్రలో కనిపిస్తాయి. అలాగే సినిమాలో అనుష్క, ప్రియమణి పాత్రలు కూడా బాగుంటాయి. కేవలం పాటలకు, గ్లామర్‌కి పరిమితం కాకుండా క్లైమాక్స్ సన్నివేశాల వరకూ ప్రాధాన్యత కలిగిన పాత్రలవి అన్నారు.

ఇక ఈ చిత్రంలో నాగార్జున..'నాది..కడప. నచ్చితే చెరుగ్గడ. నచ్చకపోతే రగడ' అని చెప్పే డైలాగు హైలెట్ అవుతుందంటున్నారు. అలాగే ఈ చిత్రం గురించి..."నాకు సినిమా మీద గట్టి నమ్మకం. సినిమాల్లోకి వచ్చి ఇరవై ఐదేళ్లు అవుతోంది. ఈ మధ్యకాలంలో హిట్టు కొట్టలేదనే బాధ, ఉక్రోషంలోంచి 'రగడ' పుట్టుకొచ్చింది. 'రగడ' అంటే ఏమిటో ఆంధ్రదేశానికంతా తెలుస్తుంది. రగడ టైటిల్‌ కు తగ్గట్టుగా వసూళ్లపరంగా రగడ సృష్టిస్తుందీ సినిమా అంటూ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. డి. శివప్రసాద్ ‌రెడ్డి నిర్మించిన 'రగడ" చిత్రం ఈ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన అనూష్క, ప్రియమణి నటించారు. తమన్ సంగీతం అందించిన సంగీతం మొన్న సోమవారం విడుదల అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X