ఇక తెల్లజుట్టు, గెడ్డంతో కనిపిస్తా: నాగార్జున
ఇప్పటివరకు నన్ను ఒకతరహాలో చూశారు. ఇక మీదట జుట్టుకు తెల్లటి రంగు వేసుకోవాలి. ఎందుకంటే.. షిరీడీ సాయిబాబాగా కన్పించబోతున్నా.దానికోసం గడ్డెంతోపాటు జుట్టు కూడా పెంచాలి. జనవరిలో సెట్ పైకి వెళుతుంది అన్నారు నాగార్జున. అలాగే 'డమరుకం' చిత్రం ఫైనల్‌కు వచ్చింది. మార్చిలో విడుదల చేస్తున్నారు. సాయిబాబా చిత్రం ఆ వెంటనే మొదలవుతుంది అని చెప్పారు. ఇక నాగార్జున, రాఘవేంద్రరావు దర్శకత్వంలో షిర్టీ సాయి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిమిత్తం ఆ మధ్యన షిర్డీలో మ్యూజిక్ సిట్టింగ్ జరిపారు. ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రసాద్ కలర్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నారు.
పాటలు పూర్తిగా తృప్తికరంగా వచ్చేకే మిగతా పనుల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేయాలని రాఘవేంద్రరావు భావిస్తున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో చారిత్రిక పాత్రలకు కూడా నిండుతనం తెచ్చి నిలబెట్టిన నాగార్జున చేయబోయే బాబా పాత్రకు ఇప్పటికే క్రేజ్ వచ్చింది.ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు.పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











