వారిద్దరూ ఉండగా నేను స్టార్ హీరోగా కొనసాగుతున్నా: లక్కీ అంటున్న నాగ్
హైదరాబాద్: అక్కినేని నాగార్జున నేడు 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసర్తికర వ్యాఖ్యలు చేసారు. తన కొడుకులిద్దరూ హీరోలయ్యాక కూడా తాను స్టార్ హీరోగా కొనసాగుతుండటం తన అదృష్టమే అన్నారు.
ప్రస్తుతం నడుస్తున్న దాన్ని తన రెండోదశ కెరీర్ గా పేర్కొన్నారు. తన చివరి సినిమా సోగ్గాడే చిన్ని నాయనా బ్లాక్ బస్టర్ అయిందని తెలిపారు. తన ఇద్దరు కుమారులు సినిమా ఇండస్ట్రీలోనే కెరీర్‌గా ఎంచుకోవడం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు.

నాగచైతన్య హీరోగా కెరీర్ లో స్థిరపడ్డాడని, అఖిల్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపిన ఆయన తన పిల్లలకు సలహాలిస్తానే తప్పా, వాటిని వాళ్లపై తన అభిప్రాయాలను ఎప్పుడూ రుద్దనని చెప్పారు. అఖిల్ రెండో సినిమా విషయంలో తాను గైడ్ చేస్తున్నానని నాగార్జున తెలిపారు.
నేడు ఆయన 57వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. దాదాపు 60 ఏళ్లకు దగ్గరైనా మన్మధుడిలా నవనవలాడుతూ యువ హీరోలతో పోటీ పడుతూ ఇప్పటికీ బాక్సాఫీసు రేసులో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు
1959 ఆగష్టు 29న జన్మించిన నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు.


Click it and Unblock the Notifications











