నా కొడుకులు గుడ్ బాయ్స్, సమంత నన్ను పిలుచే తీరు మారింది: నాగార్జున

నాగార్జున తాజాగా ఓ ఆంగ్లప్రతిక ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్‌ గురించి మాట్లాడారు.

By Bojja Kumar

అక్కినేని నాగార్జున ఇపుడు కెరీర్ పరంగా, జీవితం పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటీవలే కుమారుడు నాగ చైతన్య వివాహం జరిగింది. కోడలు సమంతో కలిసి చేసిన 'రాజుగారి గది 2' మూవీ హిట్టయింది. ఇద్దరు కుమారుల కెరీర్ సాఫీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆంగ్లపత్రిక ఆయన్ను ఇంటర్వ్యూ చేయగా తన హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు.

తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్‌ సినీ కెరీర్‌లో రాణించడానికి చాలా కష్టపడుతున్నారని, తన షాడో నుండి బయటపడి తమకు తాముగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నాగార్జున అన్నారు.

చైతు, సమంత పెళ్లి తర్వాత మీ ఇంట్లో ఏమైనా మార్పులు జరిగాయా?

చైతు, సమంత పెళ్లి తర్వాత మీ ఇంట్లో ఏమైనా మార్పులు జరిగాయా?

‘నాగచైతన్య- సమంత పెళ్లి తర్వాత మా ఇంట్లో పెద్దగా మార్పేమీ జరగలేదు. సామ్‌ నాకు చాలా కాలంగా తెలుసు. పెళ్లికి ముందే ఆమె మా కుటుంబంలో కలిసిపోయిందని.... నాగార్జున వెల్లడించారు.

సమంత పిలుపు మారింది

సమంత పిలుపు మారింది

అయితే ఒక విషయంలో మాత్రం తేడా వచ్చింది. సమంత అంతకు ముందు నన్ను ‘నాగ్‌ సర్‌' అని పిలిచేది, ఇప్పుడు ‘మామ' అంటోంది అని నాగార్జున తెలిపారు.

షూటింగులో కూడా పెళ్లి కబుర్లు చెప్పుకునే వాళ్లం

షూటింగులో కూడా పెళ్లి కబుర్లు చెప్పుకునే వాళ్లం

‘రాజుగారి గది 2'లో నేను, సమంత కలిసి పని చేశాం. ఈ చిత్ర షూటింగ్‌లో కూడా పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకునేవాళ్లం. సామ్‌ మా కుటుంబ సభ్యురాలు కావడం చాలా సంతోషంగా ఉంది... అని నాగార్జున తెలిపారు.

వాళ్లు గుడ్ బాయ్స్, వాళ్ల ఆనందమే నాకు ముఖ్యం

వాళ్లు గుడ్ బాయ్స్, వాళ్ల ఆనందమే నాకు ముఖ్యం

‘నా పిల్లలు ఆనందంగా ఉండటమే నాకు ముఖ్యం. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు. చైతన్య, అఖిల్‌ గుడ్ బాయ్స్. తమను తాము నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అని నాగార్జున తెలిపారు.

వర్మకు ముందే కండీషన్ పెట్టాను

వర్మకు ముందే కండీషన్ పెట్టాను

ఈ నెల 20 నుండి నాగార్జున, వర్మ సినిమా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున మాట్లాడుతూ... మూడు నెలల క్రితమే వర్మ నా వద్దకు వచ్చారు. స్క్రిప్టు సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాను. ఇతర సినిమాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి నా సినిమాపై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టాలని కండీషన్ పెట్టాను. అందుకు వర్మ ఒప్పుకున్న తర్వాతే నేను చేయడానికి ఒప్పుకన్నాను అని నాగార్జున తెలిపారు.

అఖిల్ సినిమా గురించి

అఖిల్ సినిమా గురించి

అఖిల్‌ నటిస్తున్న ‘హలో' సినిమా డిసెంబర్లో విడుదల కాబోతోంది. దాని పోస్ట్‌ ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌ పనులు చూసుకోవాలి. ఆ సినిమాను నేనే నిర్మిస్తున్నా. వర్మ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఆ పనులు చూసుకుంటాను అని నాగార్జున తెలిపారు.

ఫ్యామిలీ మెంబర్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నా

ఫ్యామిలీ మెంబర్స్‌తో సెలబ్రేట్ చేసుకున్నా

ఓ ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ... ఇటీవల నా 58వ పుట్టినరోజు వేడుక చాలా చిన్నగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ గా జరుపుకున్నారు. ఆ రోజు అమ్మా నాన్నలను గుర్తు చేసుకున్నాం.... అని నాగార్జున తెలిపారు.

చాలా సంతోషంగా ఉన్నా

చాలా సంతోషంగా ఉన్నా

‘నా సినీ కెరీర్‌ విషయంలో, జీవితం విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. నా కుమారులు కూడా చక్కగా రాణిస్తున్నారు. గత 30 ఏళ్లుగా నేను నటిస్తూనే ఉన్నా. ఇందులో సంతృప్తినివ్వని చిత్రాలు కూడా ఉన్నాయి. అవి లేకుంటే జీవితం చాలా బోరింగ్‌గా ఉంటుంది అని నాగార్జున తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X