»   »  చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున సిద్ధమే కానీ... అదే లేదు!

చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున సిద్ధమే కానీ... అదే లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి, బాలకృష్న, వెంకటేష్, నాగార్జున లాంటి టాలీవుడ్ అగ్రహీరోలకు సంబంధించిన సినిమాల విడుదల సమయంలో మీడియా మీట్లు జరుగడం మామూలే. ఇలా మీడియా సమావేశాలు జరిగిన ప్రతిసారి విలేకరుల నుండి ఎదురయ్యే ఓ ప్రశ్నకు ఆయా స్టార్స్ నుండి రోటీన్ సమాధానం రావడం మామూలే.

ఓం నమో వెంకటేశాయ ప్రీమియర్ షో: మెగాస్టార్, సినీ స్టార్స్ సందడి (ఫోటోస్)

తాజాగా తన 'ఓం నమో వెంకటేశాయ' సినిమా ప్రమోషన్లో పాల్గొన్న నాగార్జున కూడా రోటీన్ గా సమాధానం ఇచ్చారు. తెలుగులో మీరు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో మల్టీ స్టారర్లు చేయడానికి సిద్ధమేనా అనే ప్రశ్నకు నాగార్జున స్పందించారు.

 Nagarjuna about multi-starrers with Chiru, Balaiah, Venky

ఫ్రెష్, ఇన్నోవేటివ్ కాన్సెప్టుతో మంచి కథ దొరికితే చిరంజీవి, నాగార్జున, వెంటేష్ లాంటి స్టార్లతో మల్టీ స్టారర్లు చేయడానికి తాను సిద్ధమే అని నాగార్జున ప్రకటించారు. వాస్తవానికి ఇది చాలా రోటీ సమాధానం. అఫ్ కోర్స్ వారు ఇంతకు మించి వేరే సమాధానం చెప్పడానికి కూడా అవకాశం లేదనేది కూడా మనం ఒప్పుకోవాల్సిందే.

మీడియా ప్రతినిధుల నుండి ఇలాంటి ప్రశ్నలు ఎదురైనపుడు పాజటివ్ గా రెస్పాన్స్ కాక పోయినా... సైలెంటుగా ఉన్నా మళ్లీ ఏదో వివాదం రేకెత్తిస్తారనే భయంతో మంచి కథ దొరికితే కలిసి చేస్తాం అంటూ స్టార్ హీరోలు తప్పించుకోవడం మామూలు. వాస్తవానికి బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో మల్టీస్టారర్ సినిమాల సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. తెలుగులో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లాంటి రోజుల్లాగా స్టార్ హీరోలో కలిసి నటించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయో? ఏమో?

English summary
In a Om Namo Venkatesaya promotional interview, Nag said he is game to act in multi-starrers along with his contemporaries like Chiranjeevi, Balakrishna and Venkatesh. Nag says that fresh and innovative stories will make a sweeping entry into Tollywood when stars join forces for multi-starrers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu