'బెజవాడ'పోయినా కూడా నాగార్జున ఇంకా..
హీరోకి మాస్ తరహా సినిమాలు చాలా అవసరం. ప్రేమ కథల్లోనే నటిస్తూ ఉంటే ఓ వర్గం ప్రేక్షకులకు కొంత దూరమవ్వాల్సి వస్తుంది. వారికీ చేరువైనప్పుడే ఎక్కువ ఆదరణ ఉంటుంది. నేను కూడా తొలినాళ్లలో కిరాయి దాదా లాంటి చిత్రాలు చేశాను. అవి మాస్‌ని మెప్పించాయి...అంటూ నాగార్జున తన కుమారుడు మాస్ సినిమాలు అయిన బెజవాడ,దడ చిత్రాలు ఎంపిక చేసుకోవటం గురించి చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం చేస్తున్న మరో మాస్ చిత్రం 'ఆటోనగర్ సూర్య' గురించి చెపుతూ..కథ విన్నాను. చాలా బాగుంది. దేవా కట్టాపై నాకు పూర్తి నమ్మకముంది. ఆ తరవాత అందుకు భిన్నమైన చిత్రం చేస్తాడు. అదే... రాధామోహన్ దర్శకత్వంలో 'గౌరవం'.
మన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించే కథ అది అంటూ నాగచైతన్య కెరీర్ ని తాను ప్లాన్ చేస్తున్న విధానం గురించి చెప్పుకొచ్చారు నాగార్జున. నాగచైతన్య మాస్ హీరోగా చేసిన బెజవాడ,దడ చిత్రాలు డిజాస్టర్ అయిన నేపధ్యంలో ఆయన్ని మీడియా ఈ విషయం ప్రస్దావించినప్పుడు ఇలా స్పందించారు. ఇక ఆటో నగర్ సూర్య చిత్రాన్ని దేవకట్టా డైరక్ట్ చేస్తున్నారు. ఆ చిత్రం కూడా విజయవాడ నేపధ్యంలో కథ,కథనం జరుగుతాయి. గతంలో వెన్నెల,ప్రస్దానం చిత్రాలును డైరక్ట్ చేసిన దేవకట్టా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











