రోడ్డుపై ర్యాలీ చేసి చెప్పాలా? : నాగార్జున సూటి ప్రశ్న

By Srikanya

హైదరాబాద్ : నిర్మాణ వ్యయం అదుపు తప్పుతోందంటే... వృథా ఎక్కడ జరుగుతోందో కనిపెట్టాలి. అంతే కానీ... బడ్జెట్‌ నియంత్రణ అని ప్రచారంపై ఆంక్షలు విధించడం తప్పు. పత్రికలకు ప్రకటనలు ఇవ్వకూడదని, హోర్డింగ్స్‌ పెట్టకూడదని, టీవీల్లో ప్రచారం చెయ్యకూడదనీ... కొత్త నిబంధన తెస్తున్నారు. సినిమాకి ప్రచారం లేకపోతే ఎలా? ప్రేక్షకులకి ఎలా తెలుస్తుంది? మేం సినిమా తీశామని... రోడ్డుపై ర్యాలీ చేసి చెప్పాలా? అన్నారు నాగార్జున.

అలాగే నిర్మాణ వ్యయం అదుపు తప్పుతోందనే మాట ఖర్చు పెట్టే నిర్మాతకు సంబంధించిన విషయమది. మధ్యలో దాని గురించి మనం మాట్లాడటం అనవసరం.అవసరమనుకొంటే... టిక్కెట్టు ధరలు పెంచాలి. బయట అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. సినిమా టిక్కెట్టు ధర మాత్రం పెరగకూడదా? అన్నారు. ఇక మాస్‌ సినిమాలే అభిమానులకు నచ్చుతాయంటే పొరపాటే. ప్రతి కథ వాళ్లను మెప్పించేలా ఉండాలి. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' సినిమాలు చూసి నాకంటే ఎక్కువగా అభిమానులే సంతోషించారు అని తెలిపారు.

ఇక మాస్‌ సినిమా విషయానికొస్తే... ప్రతి స్టార్‌ హీరో కూడా మధ్యలో అలాంటి చిత్రాలు చేసి తీరాల్సిందే. మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించినప్పుడే ఒక నటుడు స్టార్‌ అవుతాడు.
చిత్ర పరిశ్రమలో అంతా ట్రెండ్‌కి ప్రాధాన్యమిస్తారు. ఒక ఫాంటసీ సినిమా విజయం సాధిస్తే... అదే తరహాలో మరికొన్ని చిత్రాలు తెరకెక్కుతుంటాయి. సోషియో ఫాంటసీ చిత్రంలో నటించాలనే కోరిక నా మనసులో చాలా రోజులుగా ఉంది. కానీ అందుకు తగిన సందర్భం రాలేదంతే. సోషియో ఫాంటసీ సినిమా అంటే... కథను బాగా తెరకెక్కించే దర్శకుడితో పాటు, అభిరుచి ఉన్న నిర్మాత కూడా కావాలి అన్నారు.

'డమరుకం' విషయానికే వస్తే... తొమ్మిది నెలలపాటు కేవలం గ్రాఫిక్స్‌ కోసమే సమయం కేటాయించారు. అంటే నిర్మాతకి ఎంత శ్రద్ధాసక్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా మంచి కథ, దర్శకుడు, నిర్మాత, నటుడు... అందరూ కలిసినప్పుడే భిన్నమైన సినిమాలొస్తాయి. 'డమరుకం' లో గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యముంటుంది. కాబట్టి బ్లూమాట్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తారు. లేని పాత్రల్ని వూహించుకొని నటించాల్సి ఉంటుంది. ఇలాంటి చిత్రాల్లో నటించడం చాలా కష్టమైన విషయం. నటీనటులు, చిత్రబృందానికి ఎంతో అవగాహన ఉంటే కానీ... ఇలాంటి చిత్రాలు తెరకెక్కవు. 'డమరుకం' చిత్రానికి గ్రాఫిక్స్‌ హంగులే ఒక కథానాయకుడిగా చెప్పుకోవచ్చు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X