»   » రాజమౌళికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి: నాగార్జున

రాజమౌళికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagarjuna
హైదరాబాద్ : రాజమౌళి కి తనపై తనకి నమ్మకం ఎక్కువ. 'ఈగ'తో సినిమా తీశాడు. రామ్‌చరణ్‌, ప్రభాస్‌, రవితేజ వీళ్లతో పాటు సునీల్‌తోనూ సినిమా చేశాడు. ఇప్పుడు 'బాహుబలి'. అతనికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు తీసుకెళ్తాడనే నమ్మకం నాకుంది అంటూ రాజమౌళి గురించి చెప్పుకొచ్చారు నాగార్జున. ఈ గురువారం నాగార్జున జన్మదినం. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

తన కుమారుడు నాగచైతన్య గురించి చెప్తూ... 'తడాఖా'తో హిట్‌ కొట్టాడు కదా? చాలా హ్యాపీ. ఆ సినిమా తమిళ వెర్షన్‌ చూసి 'తప్పకుండా ఈ సినిమా రీమేక్‌ చేయ్‌. బాగుంటుంది' అని నేనే చెప్పా. 'ఏమాయ చేశావె', '100%లవ్‌' విజయాల తరవాత చైతూకి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. ఎవరికైనా ఇవి మామూలే. అప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎదుగుదల అనేది మెల్లిగా మొదలవ్వాలి. ఒక్కసారిగా విజయాలు వచ్చేస్తే... అవి నెత్తికెక్కి కూర్చుంటాయి. నేనూ అంతేగా.? విక్రమ్‌ తరవాత మరో విజయం దక్కడానికి చాలా సమయం పట్టింది. 'శివ' తరవాత కూడా అదే పరిస్థితి.


సుమంత్‌కీ ఓ మంచి విజయం దక్కాలి. సుశాంత్‌ 'అడ్డా'తో నిరూపించుకొన్నాడు. వీళ్లందరి కెరీర్‌ సంతృప్తిగానే సాగుతోంది. ఆ విషయంలో సంతోషంగానే ఉన్నా. అయినా తెలుగులో దర్శకులకు కొదవ లేదు. అయినా పెద్ద దర్శకులతోనే చేయాలి అని కూర్చోకూడదు. యువతరానికీ అవకాశం ఇవ్వాలి. చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వీళ్లంతా యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు కదా? దర్శకులు కూడా స్టార్‌ హీరోల కోసం చూడడం లేదు అన్నారు.

అఖిల్ ఎంట్రీ గురించి చెప్తూ... వాడిపై కూడా చాలా బాధ్యత ఉంది. నేను సినిమాల్లోకి అడుగుపెట్టేటప్పుడు ఇంత ఒత్తిడి లేదు. ఆడుతూ పాడుతూ చేసుకొనేవాళ్లం. ఇప్పుడు అలా కాదు. అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అఖిల్‌ ఎంట్రీకి ముహూర్తం ఇప్పుడేం అనుకోలేదు. పందొమ్మిదేళ్లే కదా? ఇంకా టైమ్‌ ఉంది. 'మనం'లో అఖిల్‌ని చూడలేరు. కథలో ఆ అవకాశం లేదు అని చెప్పుకొచ్చారు.

English summary
Nagarjuna says that Rajamouli is great and he is hard worker. Now Nagarjuna is getting ready to release ‘Bhai’ very soon. Richa Gangopadhyay is the heroine in this movie and Devi Sri Prasad has composed the tunes. Veerabhadram has directed this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu