నాగార్జున ‘రాజన్న’ కలెక్షన్స్ పరిస్ధితి
ప్రముఖ దర్సకుడు రాజమౌళి తండ్రి విజియేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ మూవి రాజన్న. మొన్న గురువారం విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. ఇక ఈ చిత్రం చేయటంపై నాగార్జున చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన రాజన్న చిత్రం గురించి నాగార్జున మాటల్లోనే చదవండి -'రాజన్న' రెగ్యులర్ సినిమా కాదు. ఇందులో డ్యూయెట్లు లేవు. కామెడీ అంతకన్నా లేదు. ప్రథమార్ధం మొత్తం చిన్నపాపపై నడుస్తుంది. అలాంటి సినిమాను ఆదరించి ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు ఇలాంటి కథకు తెరరూపాన్ని ఇవ్వడం తేలికైన విషయం కాదు. ఇంత గొప్ప సినిమాను నిర్మించినందుకు, అందులో నటించినందుకు గర్విస్తున్నాను. నా సినిమాలన్నింటికన్నా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది 'రాజన్న'. ఈ సినిమా విషయంలో మొదటథ్యాక్స్ చెప్పాల్సింది డెరైక్టర్ విజయేంద్రప్రసాద్‌కి.
ఇది రాజమౌళి ముద్ర ఉన్న సినిమా అని చాలామంది అంటున్నారు. అందులో ఏ మాత్రం నిజంలేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం విజయేంద్రప్రసాద్ ఆలోచనల నుంచి పుట్టిందే. రాజమౌళితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చేసిన ప్రతి సీన్ రెట్టింపు ఉత్సాహంతో తీసేవారాయన. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ఓ ఆభరణం. బాలనటి యాని నటన సినిమాకు వెన్నెముక. ప్రతి శాఖవారు మనసు పెట్టి పనిచేశారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేయడమే కాక మంచి పబ్లిసిటీ ఇచ్చి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు అని నాగార్జున అన్నారు.


Click it and Unblock the Notifications











