రామ్ గోపాల్ వర్మ, అఖిల్ సినిమా గురించి నాగార్జున!

అక్కినేని వారబ్బాయి అఖిల్ నటించిన తొలి రెండు సినిమాలు అఖిల్, హలో. తాజాగా ఈ హీరో తొలిప్రేమ దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. మూడో సినిమాతోనైనా భారీ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు అక్కినేని అఖిల్.

వెంకి అట్లూరి, అఖిల్ సినిమాకు 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటిస్తోంది. రెండో సినిమా కూడా అక్కినేని ఫ్యామిలి హీరోతో చెయ్యడం విశేషం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

nagarjuna about ram gopal varma and akhil movie!

దర్శకుడు వెంకి అట్లూరి సినిమా తరువాత అఖిల్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. వర్మ స్వయంగా ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ... ''అఖిల్, వర్మ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయని చెప్పడం జరిగింది''.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X