twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్ఎక్స్ 100పై నాగార్జున సంచలన కామెంట్... అఖిల్‌తో పాటు చాలా విషయాలపై!

    By Bojja Kumar
    |

    సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చి.ల.సౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నాగార్జున బుధ‌వారం మీడియాతో ముచ్చటించారు. 'చిలసౌ' సినిమా బావుందని నాగ చైతన్య చెప్పడంతో ముందు చూడటం ఇంట్రస్టు లేదని చెప్పాను. తప్పకుండా చూడాలి మంచి సినిమా అని చెప్పడంతో.... వెళ్లి చూశాను. చాలా ప్రెష్‌గా అనిపించింది. ఇలాంటి సినిమాలు నేను ఎందుకు చేయడం లేదనే భావన కలిగిందని నాగార్జున తెలిపారు. దీంతో పాటు వివాదాస్పద ఆర్ఎక్స్ 100 మూవీతో పాటు చాలా విషయాలపై నాగార్జున స్పందించారు.

    రాహుల్ బాగా హ్యాండిల్ చేశాడు

    రాహుల్ బాగా హ్యాండిల్ చేశాడు

    ఫస్ట్‌టైమ్ డైరెక్షన్ అయినా రాహుల్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా నాకు బాగా నచ్చింది కాబట్టే అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. నీకు ఇంట్ర‌స్ట్ ఉందా? అని అడిగిత అతడు వెంటనే ఓకే చెప్పాడు. ‘ఉయ్యాలా జంపాలా' సినిమా స‌మ‌యంలో స్క్రిప్ట్ స్టేజ్ నుండి అన్న‌పూర్ణ స్టూడియోస్ ఇన్‌వాల్వ్ అయింది. కానీ ఈ సినిమాలో అలాంటి ఇన్వాల్మెంట్ ఏమీ లేదు అని నాగార్జున తెలిపారు.

    అఖిల్‌ను చూసి 45 రోజులైంది

    అఖిల్‌ను చూసి 45 రోజులైంది

    ఓ ప్రశ్నకు సమాధానం ఇసతూ... అఖిల్ ఎలా ఉన్నాడో తెలియదు. చూసి 45 రోజులు అవుతోంది. షూటింగులో భాగంగా లండన్లో ఉన్నాడు. అప్పుడప్పుడు వాళ్ల అమ్మతో మాట్లాడతాడు కానీ నాతో రోజూ మాట్లాడడు. వాడు చేస్తున్న సినిమా గురించిన విషయాలు నాకు పెద్దగా తెలియదు. ఫస్ట్ లుక్ ఏమైనా వస్తోందా? అంటూ నాగార్జున ఎదురు ప్రశ్న వేశారు.

    Recommended Video

    Director Ajay Bhupathi Comments On Ram Gopal Varma
    బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర' గురించి

    బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర' గురించి

    15 ఏళ్ల తర్వాత ‘బ్రహ్మాస్త్ర' సినిమాతో మళ్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంపై స్పందిస్తూ... నేను బాలీవుడ్‌కి వెళ్ల‌లేదు. వాళ్లే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. నేను బాలీవుడ్ సినిమా చేసి 15 ఏళ్లు అవుతుంది. అయాన్ ముఖర్జీ, క‌ర‌ణ్ జోహార్ వ‌చ్చి మీరు ఈ పాత్ర చేస్తే మా సినిమాకు గౌరవంగా ఉంటుందని అడిగారు. నాకు స్క్రిప్ట్ కాకుండా త్రీడీ వెర్ష‌న్‌లో నా పాత్ర గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే నేను చేస్తానని చెబితే వాళ్లు మూడు నెల‌ల తర్వాత మళ్లీ వచ్చారు. చాలా బాగా నచ్చింది. సినిమాలో నేను 15 నిమిషాల కనబడతారు. ఇప్ప‌టికే బ‌ల్గేరియాలో ఓ వారం షూటింగ్ కూడా అయిపోయిందని నాగార్జున తెలిపారు.

     తెలుగును వదిలి పెట్టాను, మంచిపాత్రలు వస్తే చేస్తా

    తెలుగును వదిలి పెట్టాను, మంచిపాత్రలు వస్తే చేస్తా

    శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్‌కి మూవ్ అవుతున్నాను....నన్నుకూడా రమ్మన్నాడు. నేను అప్పుడే చెప్పాను నేను నా తెలుగు ప్రేక్షకులను వదిలి రాను అని. ఇది నా ఇల్లు. ఇక్కడ నన్ను కింగ్‌లా ట్రీట్ చేస్తున్నారు. అలాంటపుడు నేనెందుకు బాలీవుడ్ వెళ్లాలి? అయితే ఎప్పుడైనా మంచి పాత్రలు వస్తే చేస్తున్నాను. 15 ఏళ్ల తర్వాత హిందీలో మళ్లీ చేస్తున్నారు. ఇంతకు ముందు తమిళంలో ఊపిరి చేశాను. నేను సినిమాలో ఎంత సేపు ఉన్నాను అనేది ముఖ్యం కాదు. నా పాత్ర ఎంత క్వాలిటీగా ఉందనేదే ముఖ్యం... అని నాగార్జున అన్నారు.

     ఆర్ఎక్స్ 100పై ఆ కామెంట్స్ ఎందుకొచ్చాయో తెలియదు

    ఆర్ఎక్స్ 100పై ఆ కామెంట్స్ ఎందుకొచ్చాయో తెలియదు

    ఈ మధ్య కాలంలో ‘ఆర్ఎక్స్ 100' లాస్ట్ 2 రీల్స్ చూశాను. దాని మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఎందుకొచ్చాయో నాకు తెలియదు. హానెస్ట్ రైటింగ్... ఫ్యామిలీ ఫిల్మ్స్ ఉంటాయి, కొంచెం అడల్ట్ మెటీరియల్ ఫిల్మ్స్ ఉంటాయి. కొన్ని ఇలాంటి సినిమాలు ఉంటాయి. అన్ని రకాల ఫిల్మ్స్ ఉంటాయి. అదే మైండ్ సెట్‌తో ఆలోచిస్తే వారు ఆ సినిమాను చాలా హానెస్టుగా తీశారు. అన్నపూర్ణలో ఆర్ఎక్స్ 100 డిఐ జరుగుతుంటే లాస్ట్ 2 రీల్స్ ఉన్నాయి చూడమంటే చూశాను. రైటింగ్, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నీ బావున్నాయి. అలాంటి సినిమా కాబట్టే హిట్ అయింది. త్వరలోనే ఫుల్ మూవీ చూడాలి అని నాగార్జున అన్నారు.

    అది కావాలని చేసిన తప్పు కాదు

    అది కావాలని చేసిన తప్పు కాదు

    కళ్యాణ్ జ్యువెల్లర్స్ యాడ్ వివాదంపై స్పందిస్తూ... అది వారు కావాలని చేసిన తప్పు కాదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. వెంటనే దాన్ని తీసేస్తున్నట్లు కూడా చెప్పారు. అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి అని నాగ్ తెలిపారు.

    English summary
    Nagarjuna about RX 100 and Brahmastra at Chi La Sow Movie Press Meet. ‘Chi La Sow’ starring Sushanth and Ruhani Sharma as lead pair has releasing on August 3rd. This film marks the debut of actor Rahul Ravindran as director. With ‘Chi La Sow’ the female lead, Ruhani Sharma is debuting as lead actress in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X