»   » నా సినిమాపై నెగటివ్ ప్రచారం చేసారంటున్న నాగార్జున!

నా సినిమాపై నెగటివ్ ప్రచారం చేసారంటున్న నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం సంక్రాంతి సందర్భంగా శుక్రవారం విడుదలవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో నాగ్ తండ్రీకొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేశారు. చాలా కాలం తర్వాత తెలుగులో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం నాగార్జున సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. అయితే సినిమాలో కొన్ని సీన్లు బాగా రాక పోవడంతో మళ్లీ రీ షూట్ కూడా చేసారు. ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ... సినిమా రీ షూట్ చేఃసిన మాట నిజమే. సినిమాలో సరిగా రాని సీన్లు బాగా తీయడానికి, ప్రేక్షకులకు మంచి క్వాలిటీ ఉన్న సినిమా అందించాలనే తపన తప్ప మరేమీ కాదు అంటున్నారు నాగార్జున.


Nagarjuna about 'Soggade Chinninayana' reshoot

నేను నిర్మించిన ఏ సినిమాకైనా రీషూట్‌ అనేది తప్పకుండా పెట్టుకుంటాను. అందుకోసం కొంత సమయం కేటాయిస్తాను. అప్పుడే సినిమాలోని లోపాలను సరిద్దుకునే వీలుంటుంది. ఒక్కసారి సినిమా విడుదలయ్యిందంటే ఏమీ చెయ్యలేం. మన చేతుల్లో ఏమీ ఉండదు. నేను చేసేది పర్ పెక్టుగా ఉండాలి, నాకు, నా వాళ్లందరికీ తృప్తిగా అనిపించాలనుకుంటాను. ఈ సినిమాను రీషూట్‌ చేశారనే విషయాన్ని నెగటివ్‌ కోణంలో ప్రచారం చేశారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నా అన్నారు నాగ్.


గతంలో ‘మనం', ‘మన్మథుడు', ‘మాస్‌', ‘సూపర్‌' సినిమాలకు కూడా రీషూట్‌ చేశాం. ఆఖరుకు ‘భాయ్‌' సినిమాకు కూడా చేశాం. కానీ ఆ సినిమా రీషూట్‌కు కూడా అతీతమైపోయింది. దానికి ఏం చేసినా ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే స్ర్కిప్టులోనే మిస్టేక్‌ ఉంది. ఆ సినిమా విడుదలకు ఓ రోజు ముందే అనుకున్నా, ‘రేపట్నించి దీనితో వచ్చే కామెంట్స్‌ను ఎదుర్కోవాలి' అని. బయటి బేనర్లు తీసిన సినిమాలకు కూడా వాళ్లు అడిగితే రీషూట్‌కు నేను రెడీగా ఉంటాను అని నాగార్జున ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


Nagarjuna about 'Soggade Chinninayana' reshoot

ఈ సినిమా స్ర్కిప్టులో సత్యానంద్‌, సాయిమాధవ్‌ బుర్రా వంటివాళ్లు పనిచేశారు. సాయిమాధవ్‌ బుర్రాకు నేను స్ర్కిప్టునిస్తే, అతను దాన్ని పూర్తిగా మార్చేశాడని ప్రచారంలోకి వచ్చింది. అది కరెక్టు కాద అన్నారు.


నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

English summary
Nagarjuna Clarification about 'Soggade Chinninayana' reshoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu