సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉంటుంది: నాగార్జున
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉంటుందని, మరే ప్రాంతానికి తరలివెళ్లే అవకాశం లేదని సినీ నటుడు నాగార్జున అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై లేదా వైజాగ్ తరలి వెలుతుందనే వార్తల నేపథ్యంలో నాగార్జున ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి. అందు వల్ల ఉన్నట్టుండి పరిశ్రమను ఎక్కడికో తరలించాలంటే సాధ్యమయ్యే పని కాదు. హైదరాబాద్ నుండి ఇప్పుడప్పుడే పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని భావిస్తున్నాను అని నాగార్జున చెప్పుకొచ్చారు.

నాగార్జున నటించిన 'మనం' చిత్రం విశేషాల్లోకి వెళితే....అన్నపూర్ణ స్టూడియాస్ పతాకంపై అక్కినేని మూడు తరాల హీరోలైన నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











