ఓటమిని అంగీకరించిన నాగార్జున..
సిల్లీగా మాట్లాడుతున్న చిన్న సినిమాల నిర్మాతలందరికీ పెద్ద పంచ్ ఇచ్చారు నాగార్జున, రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'చిన్న సినిమాని బ్రతకనివ్వట్లేదంటూ బాధ పడిపోతున్నవారి" ప్రస్తావన రాగా దానిపై కాస్త ఘాటుగానే స్పందించిన నాగార్జున 'ఏం చెయ్యమంటారు. మమ్మల్నిక సినిమాలు చెయ్యుద్దంటారా. పెద్ద సినిమాలన్నీ ఆపేసుకోమంటారా. నిజానికి ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధాలుండవు. ఉండేదల్లా మంచి సినిమా చెత్త సినిమా అనే తేడానే.
హైదరాబాద్ నవాబ్స్ దగ్గర్నుంచీ హ్యాపీడేస్, గమ్యం వరకూ అలా దమ్మున్న కథలతో మంచి సినిమాలు తియ్యమనండి ఎందుకు ఆడవో చూద్దాం. అయినా పెద్ద సినిమాలు కూడా ప్రతీదీ హిట్ అయిపోవట్లేదు కదా. ఉదాహరణగా నా సినిమా 'కేడి"నే తీసుకోండి. బాగా ఖర్చుపెట్టాం చాలా కష్టపడ్డాం. కానీ అది ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ సినిమా వారం కూడా ఆడలేదు. అంటూ తన ప్లాప్ని ఒప్పుకుంటూనే ఇలా క్లాస్ పీకి డోస్ ఇచ్చారు నాగ్. ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో నాగ్ కథానాయకుడిగా దిల్ రాజు 'గగనం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











