పదాలతో మాకేమి పనన్నారు: నాగార్జున
హైదరాబాద్ : నేను కొద్ది రోజుల కిత్రం స్విట్జర్లాండ్‌లోని నైట్‌క్లబ్‌కు వెళ్లానని అక్కడి వారు కొలవెరి పాటతో ఉర్రూతలుగుతున్నారు. మరికొన్ని బాలివుడ్ పాటలు కూడా అక్కడ వేశారు. దీనిపై అక్కడి వారిని అడిగితే సంగీతం ఇష్టం కానీ . పదాలతో మాకేమి పనన్నారు. అందుకే సంగీతానికి ఎల్లలు లేవు. ఎక్కడి వారైనా ఎవరి సంగీతాన్నైనా అభిమానించవచ్చు అని నాగార్జున అన్నారు. కింగ్‌ఫిషర్ ఆధ్వర్యంలో నగరంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న 'అక్టోబరు ఫెస్ట్' హైదరాబాద్ చాప్టర్ మొదటి ఎడిషన్‌ను సినీహీరో నాగార్జున, మిసెస్ ఇండియా శిల్పారెడ్డిలు ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు.
జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మగ్‌పై హీరో నాగార్జునతోపాటు శిల్పారెడ్డి సంతకాలు చేసి యూబీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గురుప్రీత్‌సింగ్‌తో కలిసి ఆవిష్కరించారు. అలాగే నాగార్జున ఇంకా మాట్లాడుతూ... అక్టోబరు ఫెస్ట్‌ను సైతం జర్మనీలో చూశా. అలాంటి ఫెస్ట్ నగరంలోకి రావడం చాలా బాగుంది. ఇది సంగీతాభిమానులకు, కుటుంబాలకు, ఒకరితో ఒకరు కలిసిపోయేందుకు మంచి వేదికగా నిలుస్తుందన్నారు. యూబీఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గురుప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. ఈ అక్టోబరు ఫెస్ట్‌ను మాదాపూర్‌లోని ఎన్-కన్వెన్షన్‌లో ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పాశ్చత్య సంగీతకారులు, లైవ్ బ్యాండ్, డీజేల సంగీత హోరు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందన్నారు.
ఇక ప్రస్తుతం నాగార్డున తన తాజా చిత్రం ఢమురకం విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న బంధం చుట్టూ 'డమరుకం' కథ అల్లుకొని ఉంటుంది. దీంట్లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి అన్నారు. నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి ఓ రేంజిలో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఓవర్ సీస్ రైట్స్ ని హరి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు తీసుకున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావటం,వరస విజయాలతో దూసుకు పోతున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మాత కావంట సినిమాకు డిమాండ్ తెచ్చి పెట్టింది.


Click it and Unblock the Notifications











