twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న అన్నమయ్య..నిన్న శ్రీరామదాసు..నేడు ఆదిశంకరాచార్య..

    By Sindhu
    |

    అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు వంటి అద్భుత చిత్రాల సృష్టికర్త జె.కె.భారవి ఈ సారి పెన్నుతో పాటు మెగాఫోన్‌ పట్టుకోబోతున్నారు. భారతీయ సనాతన ధర్మం అడుగంటుతున్న దశలో ఒక సంచలన ఉద్యమస్ఫూర్తిగా ఆవిర్భవించి... అద్వైత విప్లవంతో హిందూ ధర్మాన్ని అఖండంగా అప్రతిహతంగా నిలబెట్టిన జగద్గురువు ఆది శంకరాచార్యుని చరిత్రను సెల్యూలాయిడ్‌ కావ్యంగా తీర్చిదిద్దడానికి జె.కె. కంకణం కట్టుకున్నారు.

    గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ నిర్మాణంలో 'శ్రీ జగద్గురు ఆదిశంకర' పేరుతో రూపుదిద్దుకోబోతున్న ఈ అద్భుత చిత్రానికి టాగ్‌లైన్‌... 'ఎ ఫిల్మ్‌ ఫర్‌ యూత్‌'. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు 4 మార్లు పాదయాత్ర చేసి తన ప్రవచనాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆది శంకరుడు జీవించింది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఇంత లేత వయస్సులోనే శంకరుడు అంచెలంచెలుగా జగద్గురువుగా ఎలా మారాడనే అంశమే ఈ చిత్ర కథనం. 'ఎంగస్టర్స్‌' తలచుకుంటే కానిది ఏదీ ఉండదనేది ఈ కథలో సందేశం. 'యూత్‌'కి ఓ కౌన్సిలింగ్‌ క్లాస్‌ లా పర్సనాలిటీ డవలెప్‌ మెంట్‌ కి పనికి వచ్చేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం స్క్రీన్‌ ప్లే నచ్చి... ఇప్పటకి ఐదుగురు హీరోలు... ఈ సినిమాలో నటించడానికి అంగీకరించడం విశేషం.

    ఒక అద్భుత పాత్ర కోసం జె.కె.భారవికి అత్యంత సన్నిహితుడైన మరో హీరోతో సంప్రదింపులు జరుగుతున్నట్టు భోగట్టా. ఆరుగురు హీరోలతో...ముగ్గురు హీరోయిన్లతో... అనేకమంది సీనియర్‌ నటీనటులతో, 'తారమేళా'లా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకాబోతున్న 'శ్రీ జగద్గురు ఆదిశంకర'. తెలుగు చలన చిత్ర చరిత్రలో రియల్‌ మల్టీ స్టారర్‌ గా నిలిచిపోతుంది. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు జె.కె.భారవి ప్రత్యేక దీక్షాధోరణి స్వీకరించబోతున్నట్టు తెల్సింది. త్వరలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    English summary
    Nagarjuna, who is said to be romantic hero of the tollywood industry, has made his mark in devotional characters with the films like ‘Annamayya’ and ‘Sri Ramadasu’. Now, the latest news is that Nag is going to do another devotional film titled ‘Adi Shankaracharya’ in a title role. It is heard that famous story writer J.K.Bharavi has approached director K.Raghavendra Rao with a devotional storyline and asked him to make a film with Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X