నాగార్జున 'హలో బ్రదర్' సీక్వెల్ చేస్తారా?
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అప్పట్లో నాగార్జున ద్వి పాత్రలో చేసి ఒప్పించిన 'హలో బ్రదర్' చిత్రం సీక్వెల్ రానుందా? అనే డౌట్ ఫిల్మ్ సర్కిల్లో టాపిక్ గా మారింది. ఎందుకంటే హలో బ్రదర్ హిందీ రీమేక్ 'జుద్వా'కి ప్రస్తుతం సీక్వెల్ రూపొందబోతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్ గా 'జుద్వా-2'ను నిర్మించడానికి సాజిద్ నదియడ్ వాలా సిద్ధమవుతున్నారు. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యాక..అది నచ్చితేనే సీక్వెల్‌లో నటిస్తానని చెప్పిన సల్మాన్ ప్రస్తుతం ఇందులో నటించడానికి సుముఖంగా ఉన్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత సాజిద్ మీడియాకు చెప్పారు. దాంతో తెలుగులోనూ ఈ చిత్రం సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బయిలుదేరింది. అయితే హీరోగా నాగార్జునే చేస్తారా అనేది సందేహమేనంటున్నారు.
అయితే ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ తెలుగులో జోరందుకుంది. దానికి తోడు కామిడీ కలిపిన యాక్షన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇవివి ఈ సీక్వెల్ కు ప్లాన్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిందీ దగ్గరకు వస్తే 'జుద్వా' లో గతంలో హీరోయిన్స్ గా చేసినన కరిష్మా కపూర్, రంభ గెస్టు లుగా కనిపిస్తారు. అలాగే ఇప్పటి 'జుద్వా-2' హీరోయిన్ గా కరీనా కపూర్‌ని నాయికగా ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఇక ఆ చిత్రానికి సంగీతం అందించిన అను మాలిక్ నే దీనికి ఎంపిక చేసారని తెలుస్తోంది. అలాగే హలో బ్రదర్ లో అప్పట్లో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా చేసారు. ఇప్పుడు మమతామోహన్ దాస్, అనూష్క అయితే బావుంటుందంటున్నారు. ఇక హలో బ్రదర్ చిత్రానికి జాకీఛాన్ నటించిన ట్విన్ డ్రాగన్స్ మూలమనే సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











