Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
దిమ్మ తిరిగే అఖిల్ ఫైట్స్.. జాకీచాన్ గుర్తొస్తాడు.. హల్లో ఫైట్స్ కోసం ఎన్ని కోట్లో తెలుసా..
అక్కినేని వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ బెడిసికొట్టింది. అఖిల్ హీరోగా తెలుగు తెరకు పరిచమైన అఖిల్ చిత్రం దారుణంగా బెడిసికొట్టింది. దాంతో తండ్రి నాగార్జున అసంతృప్తికి లోనయ్యారు. అయితే ప్రస్తుతం తన కుమారుడిని తెరపై ఎలా చూడాలనుకొంటున్నారో ఆ విధంగానే అఖిల్‌ను హల్లో చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. హల్లో చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Recommended Video
ఇప్పటివరకు చూడని ఫైట్స్
అఖిల్‌ను ఎలా పరిచయం చేయాలనుకొన్నానో అలానే ఉంటుంది హల్లో చిత్రం అని నాగార్జున వెల్లడించారు. అయితే అఖిల్‌కు భారీ సక్సెస్‌ను అందించాలని తాపత్రయంతో ఈ చిత్రాన్ని రూపొందించాను అని ఇటీవల మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తెలుగు తెర మీద చూడనటువంటి యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు. అవి అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తాయి అన్నారు.
ఫైట్స్ కోసమే 25 కోట్లు
భారీగా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ కోసం దాదాపు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్లను రప్పించారు. భారీగా రెమ్యునరేషన్, సకల సౌకర్యాలు ఇవ్వడమే కాకుండా వారికి షూటింగ్ కోసం ప్రైవేట్ జెట్ సౌకర్యాలు ఏర్పాటు చేశారట.
ఊపిరి బిగబట్టి చూసే ఫైట్స్
టాలీవుడ్లో ఇప్పటివరకు చేయని విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి అని చిత్ర యూనిట్ చెప్పుతున్నారు. డేర్ డెవిల్ యాక్షన్ సీన్లను రూపొందించడానికి సుమారు 80 మంది స్టంట్ మాస్టర్లను ఉపయోగించుకొన్నారట. యాక్షన్ సీన్లు ఊపిరి బిగిబట్టి చూసే విధంగా ఉంటాయి అని వారు పేర్కొంటున్నారు.
జాకీ చాన్‌ను మైమరిపించే
హల్లో చిత్రంలోని యాక్షన్ సీన్లు హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా ఉంటాయి. కొన్ని సీన్లలో జాకీ చాన్ ఫైట్స్‌ను మరిపించే విధంగా అఖిల్ ఫైట్స్ చేశాడు అని నాగార్జున వెల్లడించారు. ఈ చిత్రం గురించి అనేక వివారాలు వెల్లడిస్తూ డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల అవుతున్నది అని పేర్కొన్నారు.
ఒక్కరోజులో జరిగే కథ
ఒకరోజులో జరిగే ప్రేమ కథనే హల్లో స్టోరి. చిన్నతనంలో స్నేహితులుగా ఉండే యువతి, యువకుడు 15 ఏళ్ల తర్వాత కలుసుకోవడమే ఈ చిత్ర కథ అని నాగార్జున వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జరిగే కథలో అనేక మలుపులు, ఆసక్తికరమైన పజిల్స్ ఉంటాయి. దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది అని నాగార్జున వెల్లడించారు.