రకుల్‌ ప్రీత్‌తో గొడవ పడలేదు? ఆమె గురించి నా ఫ్యామిలీకి.. నాగ్

మన్మథుడు సినిమా తర్వాత మళ్లీ 17 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం మన్మథుడు 2. నాగార్జున వయసు పైబడిన వ్యక్తిగా నటించారు. 25 ఏళ్ల యువతి రకుల్ ప్రీత్ సింగ్‌తో ప్రేమలో పడటం ఈ సినిమా కథగా రూపొందింది. గతంలో మన్మథుడు లభించిన ప్రేక్షకదారణ ఈ చిత్రానికి ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఎన్నో అంచనాలతో ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన్మథుడు 2 చిత్రం గురించి నాగార్జున మీడియాతో ముచ్చటించారు.

మన్మథుడు సినిమా నిర్మాణంలో

మన్మథుడు సినిమా నిర్మాణంలో

మన్మథుడు సినిమాకు వయాకామ్ 18తో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో వారితో కలిసి పనిచేయాలని అనుకొంటున్నాం. ఈ సినిమాతో వయాకామ్ కుదిరింది. దాంతో పాటు నా చిన్ననాటి స్నేహితుడు జెమిని కిరణ్‌తో కూడా పనిచేయడం మరీ సంతోషంగా ఉంది. క్వాలిటీ ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని ఉంది. అలాంటి సినిమాలను నిర్మించే వారితో పనిచేయడానికి రెడీగా ఉంటాను.

టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం

టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం

అలాగే కొత్త డైరెక్టర్లతో పనిచేయడం చాలా కాలంగా జరుగలేదు. నా కెరీర్‌లో ఎక్కువగా తొలి పరిచయమైన డైరెక్టర్‌తోగానీ, లేదా రెండో సినిమాకు డైరెక్ట్ చేసే వ్యక్తితో వర్క్ చేశాను. అలాగే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది. వారంతా టాలెంట్ ఉన్న వ్యక్తులు. చైతన్ చేసిన RX100 సినిమా చూశాను. అలాగే ఆ సినిమా మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో తీసుకొవాలని అనుకొన్నాం. నేను మన్మథుడు సినిమా తీసినప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ సినీ పరిశ్రమకు చాలా కొత్త. టాలెంట్ చూసే అతడిని తీసుకోవాలుకొన్నాం.

 రకుల్‌ ప్రీత్ పక్కా ప్రొఫెషనల్

రకుల్‌ ప్రీత్ పక్కా ప్రొఫెషనల్

మన్మథుడు సినిమాలో సొనాలి బింద్రేతో పనిచేయడం అదోక రకమైన అనుభూతి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్‌తో మన్మథుడు 2 చిత్రంలో నటించాను. రకుల్‌ పక్కా ప్రొఫెషనల్. రకుల్ ప్రీత్ సింగ్‌తో నాకు గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే రకుల్‌తో ఎలాంటి గొడవలు గానీ, విభేదాలు లేవు. రకుల్ ఫిట్‌నెస్ చూస్తే నాకు ఓ మొటివేషన్ మాదిరిగా ఉంటుంది. మా ఫ్యామిలీలోని కొందరికి రకుల్‌ను చూపించి ఆమెలా ఉండాలని చెబుతాను అని నాగార్జున అన్నారు.

 న్యూ జనరేషన్ సినిమాలు చేస్తా

న్యూ జనరేషన్ సినిమాలు చేస్తా

మన్మథుడు 2 లాంటి న్యూ జనరేషన్ మూవీస్ చేశాను. మళ్లీ కూడా ఇలాంటి కథలు వస్తే తప్పుకుండా చేస్తాను. ఎందుకంటే మేము మారకపోతే మా సినిమాలు ఎవరు చూడరు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఉండకపోతే మా సినిమాలు ఎవరూ చూడరు. అందుకే ఎప్పటికప్పుడు ప్రేక్షకల అభిరుచి తగినట్టుగా నటించడానికి ప్రయత్నిస్తుంటాను అని నాగార్జున తెలిపారు. హిందీలో బ్రహ్మస్త్ర సినిమాలు చేశాను. కానీ హిందీ సినిమాల కోసం ప్రయత్నించను.. కానీ వారు మంచి కథ చెబితే.. నా వద్దకు వస్తే తప్పుకుండా బాలీవుడ్ సినిమాలు తీస్తాను అని నాగ్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X