YS Jagan సినీ ప్రముఖుల భేటికి నాగార్జున గైర్హాజరు.. కారణం ఇదే అంటూ న్యూస్ వైరల్
తెలుగు సినిమా పరిశ్రమతో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకొనేందుకు ఏపీ ప్రభుత్వం పావులు కదిపింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో అగ్ర నటులు, దర్శకులు, నిర్మాతలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ భేటికి అత్యంత ప్రధాన్యం ఏర్పడింది. అయితే ఈ భేటికి ప్రభుత్వ ఆహ్వానితుల్లో టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునకు ఆహ్వానం అందింది. అయితే తీరా చూస్తే ఈ భేటికి నాగార్జున దూరంగా ఉన్నారు. అయితే ఈ భేటికి గైర్హాజరు కావడం వెనుక కారణం ఏమిటంటే..
Recommended Video

ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దల భేటి
తెలుగు సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా వాగ్వాదం నడుస్తున్న క్రమంలో పలువురు సీఎం జగన్‌ను, ఏపీ మంత్రి పేర్ని నానిని కలిశారు. ఏపీ ప్రభుత్వ పెద్దలని కలిసిన వారిలో చిరంజీవి, నాగార్జున, రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లు ఉన్నారు. అయితే చిరంజీవి, నాగార్జున వ్యక్తిగత హోదాల్లో సీఎంతో భేటి అయ్యారు.

ఏపీ ప్రభుత్వానికి సానుకూలంగా నాగార్జున
అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాగార్జున నటించిన బంగార్రాజు చిత్రం రిలీజ్ జరిగింది. ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. టిక్కెట్ల రేట్ల తగ్గింపు వివాదం నా సినిమాకు సంబంధం లేదు. నాకు ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ నాగార్జున ప్రకటించారు. దాంతో ఏపీ ప్రభుత్వంతో నాగార్జునకు అవగాహన ఉందనే విషయం సోషల్ మీడియాలో ఘాటుగా వినిపించింది.

నాగార్జునకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం
ఇక సీఎం జగన్‌తో భేటికి ఒక రోజు ముందు వరకు నాగార్జున అక్కినేని విజయవాడకు వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం ఏపీకి వెళ్లిన సినీ ప్రముఖుల బృందంలో నాగార్జున కనిపించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఏపీ సీఎంతో భేటికి నాగార్జున గైర్హాజరు కావడం వెనుక వ్యక్తిగత కారణాలే కారణమనే విషయం బయటకు వచ్చింది.

అమలకు కరోనావైరస్ అంటూ
అయితే ఏపీ ప్రభుత్వంతో సమావేశానికి నాగార్జున వెళ్లక పోవడానికి కారణం ఆయన సతీమణి అమలకు కోవిడ్ పాజిటివ్ అనే వార్త బయటకు వచ్చింది. అమల కరోనావైరస్‌తో బాధపడుతున్నందున నాగార్జున కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. అందుకే ఈ భేటికి దూరంగా ఉన్నారనే విషయం సినీ వర్గాల్లో ప్రచారం అవుతున్నది.

ఏపీ సీఎంతో ముగిసిన సినీ ప్రముఖుల భేటి
ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖుల భేటి ముగిసింది. సీఎంను కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి, నటుడు పోసాని కృష్ణమురళీ ఉన్నారు. ఈ భేటికి సంబంధించిన వివరాలను సినీ ప్రముఖులు మీడియాకు వెల్లడించనున్నారు. అయితే ఎలాంటి చర్చలు జరిగాయి? ఎలాంటి హామీలు లభించాయి అనే విషయాలపై సినీ, మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











