అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ, కరణ్ జోహర్ మూవీపై నాగ్ క్లారిటీ
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని క్లారిటీ ఇచ్చారు. అఖిల్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేద్దామని దర్శక, నిర్మాత కరణ్ జోహర్ రెండేళ్ల క్రితమే ఆఫర్ ఇచ్చాడు. వాస్తవానికి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఓ మంచి సినిమా కోసం వాళ్లిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. నాకు తెలిసింది అంతవరకే. ఇంకామైనా జరిగితే వారి మధ్యనే ఉంది అని తెలిపారు.
ముందుగా తెలుగులో చేద్దాం. ఆ తర్వాత హిందీలో తీసుకోమని కరణ్‌కు నేను సలహా ఇచ్చాను. దాని వల్ల సినిమా గురించి సరైన అవగాహన అఖిల్ వస్తుంది. స్క్రీన్ మీద కూడా చక్కగా కనిపిస్తాడని చెప్పాను అని నాగార్జున వెల్లడించారు.

బేకిగ్గా అఖిల్ అంటే కరణ్ జోహర్‌కు ఇష్టం. రెండు మూడుసార్లు అఖిల్‌ను పెట్టి సినిమా తీద్దామని చెప్పాడు. అయితే అప్పుడు అఖిల్ చాలా చిన్నవాడు అని చెప్పాను. మీరు తొందరపడవద్దు అని అన్నాను. మా మాట వినకుండా అఖిల్ తొందరపడి చేతులు కాల్చుకొన్నాడు. ఇప్పుడిప్పుడే మాట వింటున్నాడు. ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్దతనం నాలో కనిపిస్తుంది అని నాగార్జున చమత్కరించారు.


Click it and Unblock the Notifications











