twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్దతిస్తే సరిపోదు.. యాక్షన్ ప్లాన్ అవసరమన్న కింగ్

    |

    ఫేక్ న్యూస్ కట్టడి, ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్స్‌ను నియంత్రించాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వక్రీకరించి వార్తలు రాసిని వెబ్‌సైట్లపై విజయ్ దేవరకొండ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్ మొత్తం కదిలింది. స్టార్ హీరోలైన చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున స్పందించగా.. దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలన్నీ ముక్తకంఠంలో విజయ్‌కు మద్దతిచ్చాయి.

    తప్పుడు వార్తలు, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించే వెబ్‌పైట్లను నియంత్రించడం, వాటికి అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైందని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు, కొరటాల శివ, పూరి జగన్నాద్, మెహర్ రమేష్, శివ నిర్వాణ, టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలన్నీ స్పందించాయి. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

    Nagarjuna Akkineni Demands Action Plan On Kill Fake News

    ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున చిరు ట్వీట్‌కు స్పందిస్తూ.. 'డియర్ చిరంజీవి గారు, మన సహనటుడు విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపినందుకు అభినందిస్తున్నాను. ఈ పోరాటంలో మేమంతా ఉంటాము. మహేష్ బాబు, రవితేజ, రానా, కొరటాల శివ, క్రిష్, వంశీ పైడిపల్లి మద్దతిస్తే సరిపోదు.. మనకు ఓ యాక్షన్ ప్లాన్ అవసరమ'ని తెలిపాడు.

    English summary
    Nagarjuna Akkineni Demands Action Plan On Kill Fake News. Nagarjuna Says That really appreciate your support to a colleague TheDeverakonda. we all have been through this anguish! Stand by you is not enough,WE NEED AN ACTION PLAN!!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X