కేటీఆర్‌తో ఆ బంధమే.. ఎమ్మెల్యేగా.. రాజకీయ ప్రవేశంపై నాగార్జున క్లారిటీ!
వయసు మీద పడుతున్నా యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హుషారుగా సినిమా తర్వాత సినిమాలు చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి దేవదాస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రంలో ఆక్షాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ రూపొందిస్తున్న ఈ చిత్ర విశేషాలను నాగార్జున, నాని, చిత్ర యూనిట్ పంచుకొన్నారు. ఈ సందర్బంగా రాజకీయ ప్రవేశంపై నాగ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
బిగ్‌బాస్ తెలుగు 2 విజేత మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

పాలిటిక్స్‌లోకి ఎంట్రీపై
రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై సమాధానం ఇస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఆ ఆలోచన కూడా లేదు. పాలిటిక్స్‌లోకి వస్తున్నారనే వార్తలో వాస్తవం లేదు. అంతా మీరే రాసేస్తున్నారు. నా వైపు నుంచి ఎలాంటి ఉత్సాహం లేదు అని నాగార్జున అన్నారు.

ఆ వార్తలో వాస్తవం లేదని
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వార్త చక్కర్లు కొడుతున్నదనే ప్రశ్నకు నాగార్జున సమాధానమిస్తూ.. నాకు ఆ ఉద్దేశం లేదు. అందులో కూడా వాస్తవం లేదు అని తెలిపారు. ప్రస్తుతం సినిమాలు చేసుకోనివ్వండి. లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుందో మనకేమి తెలుసు అని అన్నారు.

మంత్రి కేటీఆర్‌తో నా రిలేషన్
మంత్రి కేటీఆర్ నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. ఆ రిలేషన్ అలానే ఉండనివ్వండి. మా మధ్య అంతకంటే వేరే బంధం లేదు అని నాగార్జున ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతేగానీ రాజకీయంగా మా మధ్య ఎలాంటి రిలేషన్స్ లేవు అని పేర్కొన్నారు.

ఏపీ పాలిటిక్స్‌లోకి
గతంలో ఆంధ్రా పాలిటిక్స్‌లోకి నాగార్జున ఎంట్రీ ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. వైసీపీ తరఫున నాగార్జున విజయవాడ పార్లమెంట్‌కు పోటీ చేస్తారని ఊహాగానాలు అప్పట్లో జోరందుకొన్నాయి. తాజాగా తన రాజకీయాలపై ఆసక్తి లేదు అనే మాటను స్వయంగా వినిపించడంతో ఆ విషయంపై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











